Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 141916
            [news_title_telugu_html] => 

రోగి పొట్టలో 452 లోహపు వస్తువులు

[news_title_telugu] => రోగి పొట్టలో 452 లోహపు వస్తువులు [news_title_english] => Doctors find 452 metal items in patient stomach [news_short_description] => గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరాడు. అజీర్తి వల్లేనని భావించిన వైద్యులు ఆయనకు సాధారణ చికిత్స...... [news_tags_keywords] => Ahmedabad,Gujarat [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-15 00:25:35 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రోగి పొట్టలో 452 లోహపు వస్తువులు - Doctors find 452 metal items in patient stomach - EENADU
close

తాజా వార్తలు

రోగి పొట్టలో 452 లోహపు వస్తువులు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరాడు. అజీర్తి వల్లేనని భావించిన వైద్యులు ఆయనకు సాధారణ చికిత్స చేసి పంపారు. ఎంతకీ తగ్గకపోవడంతో ఎక్స్‌ రే తీశారు. ఆ నివేదికను చూసి షాకవ్వడం వారి వంతైంది. ఆ వ్యక్తి కడుపులో లోహపు వస్తువులు ఉండడాన్ని గమనించారు. ఆపరేషన్‌ చేసి ఏకంగా నాలుగు కేజీల బరువు గల 452 లోహపు వస్తువులను బయటకు తీశారు. నైల్‌ కట్టర్‌, పిన్నులు, నట్టులు, బోల్టుల, చిన్న చిన్న మేకులు, నాణేలు అందులో ఉన్నాయి. 

అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆసుపత్రిలోని నలుగురు వైద్యులు సుమారు మూడు గంటలపాటు శ్రమించి ఈ శస్త్ర చికిత్స చేశారు. గత ఏడెనిమిది నెలలుగా ఇవే తిని ఉండవచ్చని వైద్యులు తెలిపారు. స్క్రిజోఫీనియా అనే వ్యాధి కారణంగా ఇవి కూడా ఆహార పదార్థాలేనని భావించి తిని ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉందని, కొన్ని రోజులు పర్యవేక్షణలో ఉంచాల్సి వస్తుందని వైద్యులు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.