close

తాజా వార్తలు

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. భద్రత మరింత మెరుగు

ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సాప్‌ మరో సరికొత్త ఫీచర్‌ను వినియోగదారుల ముందుకు తీసుకురానుంది. వాట్సాప్‌లో వేలిముద్ర గుర్తించే ఫీచర్‌ సిద్ధమైనట్లు సమాచారం. త్వరలో ఇది ఆండ్రాయిడ్‌ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ వినియోగదారులకు భద్రతను మరింత పెంచనుంది. ఐవోఎస్‌లో ఇప్పటికే బయోమెట్రిక్‌ గుర్తింపు వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన ఆరునెలలకు ఈ ఫీచర్‌ రావడం గమనార్హం. 

ప్రస్తుతం బీటావెర్షన్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. అందుకోసం 2.19.221 ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మూడు చుక్కల మెనూను తెరిచి.. దానిలో సెట్టింగ్స్‌ నుంచి అకౌంట్‌కు వెళ్లాలి. అక్కడ ‘ఫింగర్‌ ప్రింట్‌ లాక్‌’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. ఒక వేళ మీరు అప్‌డేట్‌ చేసినా ఈ ఆప్షన్‌ కనిపించకపోతే.. మీ చాట్‌ హిస్టరీని బ్యాకప్‌ తీసుకొని యాప్‌ను రీఇన్‌స్టాల్‌ చేయాలి. ఫింగర్‌ ప్రింట్‌ లాక్‌ను ఓపెన్‌ చేసేందుకు మీ వేలిముద్రను నమోదు చేసుకొవాలి. అనంతరం ఆటోమేటిక్‌ లాక్‌ సమయాన్ని ఎంచుకోవాలి. ఈ లాక్‌ ఉన్నా వాట్సాప్‌ కాల్స్‌ను మాత్రం అందుకోవచ్చు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.