close

తాజా వార్తలు

బంతి తగిలి.. అంపైర్‌ మృతి

లండన్‌: బంతి తగలడంతో దాదాపు నెల రోజుల తర్వాత ఓ అంపైర్‌ మృతిచెందాడు. నెలరోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న అంపైర్‌ గురువారం కన్నుమూశాడు. ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్‌లో భాగంగా జులై 13న పెమ్‌బ్రోక్‌షైర్‌ X నార్‌బెత్‌ జట్ల మధ్య కౌంటీ క్రికెట్‌ జరిగింది. ఆ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన జాన్‌ విలియమ్స్‌(80) తలకు బంతి తగలడంతో తీవ్ర గాయమైంది. 

గాయపడిన వెంటనే విలియమ్స్‌ను కార్డిఫ్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా కోమాలోకి వెళ్లాడు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హావర్‌ఫోర్డ్‌వెస్ట్‌లోని మరో ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. పెమ్‌బ్రోక్‌షైర్‌ క్రికెట్‌ క్లబ్‌ గురువారం ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలిపింది. ‘అంపైర్‌ జాన్‌ విలియమ్స్‌ గురించి చేదు వార్త వినాల్సివచ్చింది. ఈ ఉదయం ఆయన ఆస్పత్రిలో మృతిచెందారు. పెమ్‌బ్రోక్‌షైర్‌ క్రికెట్‌ తరఫున సంతాపం తెలుపుతున్నాం’ అంటూ ట్వీట్‌ చేసింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.