
తాజా వార్తలు
‘రివ్యూలు చూసి బాధపడ్డా’
‘కానీ.. ఇంకా మంచి స్పందన ఊహించా’
హైదరాబాద్: కథను దృష్టిలో పెట్టుకుని ‘రణరంగం’ సినిమాను తెరకెక్కించలేదని యువ కథానాయకుడు శర్వానంద్ అన్నారు. ఆయన హీరోగా ఆగస్టు 15న విడుదలైన సినిమా ఇది. సుధీర్‌వర్మ దర్శకుడు. కల్యాణి ప్రియదర్శన్, కాజల్ కథానాయికలు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా తొలి రోజున రూ.8.10 కోట్లు రాబట్టి, శర్వా కెరీర్లోనే కొత్త రికార్డును సృష్టించింది. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా శర్వా మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలివి..
ఆ మాట ఎవరూ అనలేదు
‘‘రణరంగం’ సినిమాకు మంచి టాకే లభించింది. సినిమా బాగోలేదని ఎవరూ అనలేదు. నిజానికి దీనికంటే ఇంకా మంచి స్పందనను ఊహించా. కానీ ఆశించిన విధంగా విజయం సాధించలేదు. ఈ సినిమా కథను రవితేజ కోసం సిద్ధం చేశారు. కానీ ఆ తర్వాత కథ నా దగ్గరికి వచ్చింది. స్క్రీన్‌ప్లే నాకు చాలా నచ్చింది. ఇప్పటి వరకు నేను ప్రేమకథలు, కామెడీ కథల్లోనే నటించా. ఇది విభిన్నంగా అనిపించింది. అందుకే నటించా. ఇలాంటి యాక్షన్ సినిమా నేను ఎప్పుడూ చేయలేదు. రెండు విభిన్న పాత్రల్లో నటించే అవకాశం వచ్చిందని చేశా’.
సురేఖ ఆంటీ ఫోన్ చేసి..
‘ఈ సినిమాలో నా నటనకు ప్రశంసలు వచ్చాయి. సురేఖ ఆంటీ (చిరంజీవి సతీమణి) ఫోన్ చేసి.. ‘చాలా అందంగా ఉన్నావు, చూడటానికి బాగున్నావు’ అన్నారు. నాకు వ్యక్తిగతంగా యంగ్ పాత్ర నచ్చింది. ఈ సినిమాలో నా గెటప్‌ల కోసం పెద్దగా కష్టపడలేదు. యంగ్ పాత్రలో నేను చిరంజీవి ఫ్యాన్‌గా కనిపించా. అందుకు ‘ఘరానా మొగుడు’, ‘అల్లుడా మజాకా’ సినిమాలో చిరు స్టైల్‌ను కాస్త ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశా’.
ముందే చెప్పా
‘ఈ సినిమాతో సందేశం ఇవ్వడం లేదని ముందు నుంచే చెబుతూ వచ్చా. ప్రేక్షకులకు స్క్రీన్‌ప్లే, యాక్షన్, స్టైల్ నచ్చుతుందని వాటిని బాగా హైలైట్ చేశాం. కానీ దాన్ని మరోలా తీసుకున్నారు. ఇది కథను దృష్టిలో పెట్టుకుని చేసిన చిత్రం కాదు. రివ్యూలు వచ్చినప్పుడు కాస్త బాధపడ్డా. ప్రేక్షకులు సినిమా చూసి బాలేదని చెప్పలేదు. కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. కానీ తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కావడం లేదు. కొన్ని వర్క్అవుట్ అవుతున్నాయి, కొన్ని కావడం లేదు’.
కాస్త సమయం కావాలి
‘నా తర్వాతి ప్రాజెక్టును నిర్ణయించుకోవడానికి కాస్త సమయం కావాలి. ప్రస్తుతం నేను తికమకలో ఉన్నాను. ఎందుకంటే.. చిత్ర పరిశ్రమలో ఒక టాక్ ఉంది. ప్రేక్షకులు ఒకలా చెబుతున్నారు. విమర్శకులు మరోలా మాట్లాడుతున్నారు. అందుకే సమయం తీసుకోవాలి అనుకుంటున్నా. శర్వా అంటే మంచి కథ ఉంటుంది అని అంటుంటారు. దాన్ని ఈ సారి మిస్ అయ్యాను. బుక్‌మై షోలో చూస్తే కింద సీట్లు ఫుల్ అవుతున్నాయి. పైన సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇది ఓ విధంగా సంతోషాన్ని ఇచ్చింది, మరోపక్క బాధగానూ ఉంది. నిజానికి నా సినిమా అంటే ముందు పై సీట్లు ఫుల్ అయ్యేవి’.
వారిని గౌరవిస్తా
‘విమర్శకుల్ని ఎప్పుడూ నేను గౌరవిస్తా. వాళ్లు చెప్పింది నిజమేనని నాకు కూడా చాలా సార్లు అనిపించింది. స్క్రీన్‌ప్లే కొన్ని చోట్ల ప్రేక్షకులకు అర్థం కాదని అన్నారు. నిజమే సగం మందికి అర్థమైంది, సగం మందికి అర్థం కాలేదు. కాబట్టి వారి అభిప్రాయాల్ని నేను గౌరవిస్తాను. కలెక్షన్ల పరంగా నేను సంతోషంగానే ఉన్నా. కానీ రివ్యూల పట్ల కూడా సంతోషంగా ఉండాలి కదా?’.
అది మీకు నచ్చుతుంది
‘నేను విభిన్నమైన సినిమాలు, కథలు ఎంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుంటాను. ఇప్పుడు తమిళ రీమేక్ ‘96’లో నటిస్తున్నా. సగభాగం షూటింగ్ పూర్తయింది. దీని తర్వాత మరో మంచి కథలో నటించబోతున్నా. అది మీకు కూడా నచ్చుతుంది. తమిళం, తెలుగులో మరో సినిమా చేయబోతున్నా’.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- కొడితే.. సిరీస్ పడాలి
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
