
తాజా వార్తలు
ఇంటర్నెట్ డెస్క్: అతడు ఎంతో వినసొంపైన గొంతుతో పాటలు పాడగలడు. గొప్ప సింగర్ కావడం అతడి లక్ష్యం కూడా.. కానీ ప్రస్తుతం పరిస్థితుల ప్రభావం కారణంగా జొమాటోలో ఆహార పదార్థాల సరఫరా వ్యక్తిగా పని చేస్తున్నాడు. కానీ ఓ వ్యక్తి చొరవతో అతడు పాడిన ఒక పాట ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అంతేకాకుండా అతడికి నెటిజన్ల నుంచి ప్రశంసలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా గౌహతీకి చెందిన అనిర్భన్ చక్రవర్తి అనే వ్యక్తి జొమాటోలో ఆహారాన్ని ఆర్డర్ చేశారు. తనకి ఆహారం సరఫరా చేసే ప్రంజిత్ హలోయి అనే వ్యక్తి ప్రొఫైల్‌ను చక్రవర్తి పరిశీలించారు. అందులో సింగర్ కావాలన్న ప్రంజిత్ ఆశయాన్ని గమనించారు. అనంతరం ఆహారాన్ని ఇవ్వడానికి వచ్చిన ప్రంజిత్ను చక్రవర్తి ఒక పాట పాడాల్సిందిగా కోరారు. దీంతో అతడి కోరిక మేరకు ప్రంజిత్ 1976 నాటి ‘చిట్చోర్’ సినిమాలోంచి ‘గొరీ తేరా గావ్ బడా ప్యారా’ అనే పాటను పాడాడు. అతడి పాట ఎంతో వినసొంపుగా ఉండటంతో చక్రవర్తి దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ‘ఏదో ఒకనాటికి సింగర్ కావడం అతని ఆశయం. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి అతడి కలను సాకారం చేసేందుకు కృషి చేయాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. చక్రవర్తి పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారి 9వేలకు పైగా లైక్స్, 7వేలకు పైగా షేర్స్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రంజిత్ గొంతు ఎంతో బాగుందని కామెంట్లు చేస్తున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- పోలీసులపై పూల జల్లు
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఎన్‌కౌంటర్‌ను నిర్ధారించిన సజ్జనార్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
