close

తాజా వార్తలు

విలియమ్సన్‌, దనంజయ అనుమానాస్పద బౌలింగ్‌!

శ్రీలంక X న్యూజిలాండ్‌ మధ్య తొలి టెస్టులో..

గాలె: శ్రీలంక X న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఆదివారం ముగిసిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, శ్రీలంక బౌలర్‌ అకిల దనంజయ అనుమానాస్పద బౌలింగ్‌ చేశారనే ఫిర్యాదులు అందాయని ఐసీసీ మంగళవారం ప్రకటించింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ ఆడుతుండగా విలియమ్సన్‌ మూడు ఓవర్ల పాటు బౌలింగ్‌ వేశాడు. అలాగే దనంజయ ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీశాడు. వీరిద్దరి బౌలింగ్‌ శైలిపై అనుమానం కలిగిన మ్యాచ్‌ పర్యవేక్షకులు ఐసీసీకి ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో వారిద్దరూ 14 రోజులలోపు ఐసీసీ ముందు హాజరై తమ బౌలింగ్‌శైలికి సంబంధించిన పరీక్షల్లో హాజరవ్వాలి. ఈ మేరకు రెండు జట్లకూ నోటీసులు అందజేశామని ఐసీసీ పేర్కొంది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 249 పరుగులు చేయగా, లంక 267 పరుగులకు ఆలౌటైంది. అనంతరం కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 285 పరుగుచేయడంతో లంక ముందు 268 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నె (122; 243 బంతుల్లో 6×4, 1×6), తిరిమానె (64) రాణించడంతో శ్రీలంక ఆరు వికెట్లతో విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌లో లంక 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు గురువారం ప్రారంభం కానుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.