
తాజా వార్తలు
అమరావతి: వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. వరద వచ్చి వారం దాటినా ఇంతవరకు నష్టం అంచనాకు అధికారులు రాలేదని, సహాయక చర్యలూ చేపట్టలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని వెల్లటూరు, కిష్కిందపాలెం, చింతపోటు జువ్వాలపాలెం తదితర వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించి బాధితులను పరామర్శించారు. రైతులు మళ్లీ నిలదొక్కుకునే వరకు ప్రభుత్వం అండగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ వరదలు ప్రభుత్వ సృష్టించిన విపత్తు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నా నీరు నిల్వ చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఓ పద్ధతి ప్రకారం నీరు వదిలితే ఈ ఇబ్బంది వచ్చేది కాదని చెప్పారు. ఈ పర్యటనలో ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, మద్దాల గిరి, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
