Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001230
            [news_title_telugu_html] => 

318 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం

[news_title_telugu] => 318 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం [news_title_english] => India won by 318 runs [news_short_description] => టెస్టు సిరీస్‌లోనూ టీమిండియా శుభారంభం చేసింది. ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రా(5/7) విజృంభించడంతో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌ 318 పరుగుల తేడాతో.... [news_tags_keywords] => IND VS WI, bumarh,shami,kohli,cricket [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-26 01:48:10 [news_isactive] => 1 [news_status] => 2 ) )
318 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం - India won by 318 runs - EENADU
close

తాజా వార్తలు

318 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం

ఐదు వికెట్లు పడగొట్టిన బుమ్రా 
శతకంతో చెలరేగిన రహానె
100 పరుగులకే కుప్పకూలిన విండీస్‌
ఆంటిగ్వా

టెస్టు సిరీస్‌లోనూ టీమిండియా శుభారంభం చేసింది. ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రా(5/7) విజృంభించడంతో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌ 318 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. బుమ్రాతో పాటు పేస్‌ బౌలర్లు ఇషాంత్‌ శర్మ(3/31), షమి(2/13) చెలరేగడంతో 419 పరుగుల ఛేదనలో వెస్టిండీస్‌ 100 పరుగులకే కుప్పకూలింది. కీమర్‌ రోచ్‌(38; 31బంతుల్లో 1×4, 5×6) బ్యాట్‌ ఝళిపించడంతో స్కోరుబోర్డుపై ఆ మాత్రం పరుగులైనా కనిపించాయి. అంతకుముందు 185/3తో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్‌ మరో 158 పరుగులు జోడించి 343/7 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. అజింక్య రహానె(102; 242 బంతుల్లో 5×4) శతకం సాధించగా.. హనుమ విహారి(93; 128బంతుల్లో 10×4, 1×6) చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రెండో టెస్టు శుక్రవారం కింగ్‌స్టన్‌లో జరగనుంది. 

చెలరేగిన బుమ్రా..
భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్‌ను బుమ్రా భయపెట్టాడు. పదునైన బంతులతో బ్యాట్స్‌మెన్‌ను నిలువరించాడు. ఓపెనర్లు బ్రాత్‌వైట్‌(1), క్యాంప్‌బెల్‌(7).. పది పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నారు. మరో బౌలర్‌ ఇషాంత్‌ కూడా వైవిధ్యమైన బంతులతో ఆకట్టుకున్నాడు. వీరి ధాటికి టీ విరామానికి 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది కరీబియన్‌ జట్టు. ఆ తర్వాత వీరికి షమి కూడా తోడు కావడంతో విండీస్‌ ఓటమి ఖాయమైంది. చివర్లో రోచ్‌, కమిన్స్‌(19) కొన్ని షాట్లతో మెరిపించారు. 

రహానె తోడుగా విహారి..
నాలుగో రోజు ఆటలో రెండో ఓవర్‌లోనే చేజ్‌ బౌలింగ్‌లో కెప్టెన్‌ కోహ్లీ(51) ఔట్‌ అయ్యాడు. తర్వాత వచ్చిన విహారితో.. రహానె ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. విండీస్‌ బౌలర్లను చక్కగా ఎదుర్కొంటూ వీరిద్దరూ ముందుకు సాగారు. లంచ్‌ సమయానికి 287/4తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. విరామం తర్వాత సెంచరీ పూర్తి చేసిన రహానె.. కాసేపటికే గాబ్రియెల్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. పంత్‌(7), విహారి ఔటయ్యాక కోహ్లీ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాడు. 

10.. టెస్టుల్లో రహానె సాధించిన శతకాల సంఖ్య. రెండేళ్ల తర్వాత అతనికిదే తొలి సెంచరీ కావడం విశేషం. 
27..  భారత సారథిగా విరాట్‌ కోహ్లీ టెస్టుల్లో సాధించిన విజయాలు. 47 టెస్టుల్లోనే కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. 

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 297
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 222
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 343 డిక్లేర్డ్‌ (112.3 ఓవర్లలో 7 వికెట్లకు)
వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌: 100 (26.5 ఓవర్లలో ఆలౌట్‌)


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.