close

తాజా వార్తలు

విశాఖ పోర్టులో అగ్నిప్రమాదం

విశాఖ : విశాఖ పోర్టులో అగ్నిప్రమాదం సంభవించింది. వెస్ట్ క్యూ-1 బెర్తు వద్ద హెచ్ఎన్సీ క్రేన్ దగ్ధమయ్యింది. మధ్యాహ్నం మూడున్నర సమయంలో ఈ ప్రమాదం సంభవించగా.. ప్రమాద వివరాలు బయటకు పొక్కకుండా అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం.  ప్రమాద సమాచారం అందిన వెంటనే పోర్టు అగ్నిమాపక విభాగం మంటలను అదుపు చేసింది. ఆస్తినష్టం వివరాలు విశాఖ పోర్టు వెల్లడించలేదు.

అంతకుముందు ఈ నెల 12 సైతం విశాఖ నౌకాశ్రయం అవుటర్‌ హార్బర్‌లో కోస్టల్‌ జాగ్వార్‌ అనే టగ్‌(చిన్న నౌక) భారీ అగ్ని ప్రమాదానికి గురైంది. టగ్‌ డెక్‌ భాగంలో నిప్పంటుకుని క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.