
తాజా వార్తలు
ఆద్యకు కాస్త సిగ్గు: అడివి శేష్
హైదరాబాద్: కథానాయకుడు అడివి శేష్ నటి, ఫిల్మ్‌మేకర్ రేణూ దేశాయ్ కుటుంబ సభ్యుల్ని కలిశారు. పవన్ కల్యాణ్-రేణుల కుమారుడు అకీరా నందన్, కుమార్తె ఆద్యతో కలిసి సరదాగా సమయం గడిపినట్లు శేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోల్ని ట్విటర్లో షేర్ చేశారు. ‘హ్యాండ్సమ్ కుర్రాడు అకీరాతో ఈ రోజు ఉత్సాహంగా గడిచింది. అతడికి ‘ఎవరు’ సినిమా చాలా నచ్చింది. ఇద్దరం అలా సరదాగా సమయం గడిపాం, భోజనం చేశాం.. జీవితం గురించి సాధారణంగా మాట్లాడుకున్నాం. గంభీరమైన స్వరంతో 6.4 అడుగుల ఎత్తున్న వ్యక్తి అతడు. మా ఇద్దరిదీ ఎడమ చేతి వాటం కావడం సంతోషంగా ఉంది. మా ఇద్దరిలో చాలా విషయాలు కామన్‌గా ఉన్నాయి. చిట్టి ఆద్యకు కెమెరా అంటే కాస్త సిగ్గు. రేణూ దేశాయ్‌తో సంభాషించడం ఆనందంగా ఉంది. మీరు ఓ గొప్ప కవయిత్రి. మమ్మల్ని మీ ఇంటికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు ప్రేమమాలినీ’ అని ఆయన పోస్ట్ చేశారు.
శేష్, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎవరు’ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకట్ రాంజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది. నవీన్ చంద్ర, మురళీ శర్మ, పవిత్ర లోకేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీవీపీ సినిమా సంస్థ నిర్మించింది. ప్రస్తుతం శేష్ ‘మేజర్’ సినిమాలో నటిస్తున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మహేశ్-విజయశాంతి ఇది గమనించారా?
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- అనుమానాలు ఉంటే వీడియోను చూడండి..
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- టీ కోసం ఆగిన నిఖిల్‌కు వింత అనుభవం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
