close

తాజా వార్తలు

దుస్తుల్ని అద్దెకు ఇవ్వాలనుకుంటున్నా ఎలా?

వేడుక చిన్నదైనా ఖరీదైన డిజైనర్‌ దుస్తులకే ప్రాధాన్యం ఇస్తున్నారు చాలామంది. ఆపై వాటిని ఒకటి రెండుసార్లు వాడి పక్కన పడేస్తున్నారు. దీనివల్ల డబ్బు వృథా. ఇది గమనించాకే తక్కువ ధరలో సందర్భాలకు తగినట్లుగా వేసుకునేలా డిజైనర్‌ దుస్తులు అద్దెకు  ఇవ్వాలనుకుంటున్నా. నా ప్రణాళిక ఎలా ఉండాలి... తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ?  పెట్టుబడి ఎంత అవసరం?

- ప్రేరణ, బెంగళూరు

మీరన్నది నిజమే! గంటా, రెండుగంటల పాటు జరిగే ఓ చిన్న వేడుకకి సైతం వేల రూపాయల దుస్తుల్ని కొంటున్నారు. ఆపై పక్కన పెట్టేస్తున్నారు. తరువాత డబ్బుల్ని వృథా చేశామని బాధపడుతున్నారు. ఈ పరిస్థితికి చెక్‌ పెట్టేందుకు ఇప్పటికే కొన్ని సంస్థలు తక్కువ ధరకే డిజైనర్‌ దుస్తుల్ని అద్దెకిస్తున్నాయి. ఈ పద్ధతి విదేశాల్లో ఎప్పటి నుంచో ఉంది. మెట్రో నగరాల్లో యువత ఇప్పుడిప్పుడే వీటిని వినియోగించుకుంటున్నారు. ముందు మీరో చిన్నపాటి అధ్యయనం చేయండి. ఇప్పటికే దుస్తులు అద్దెకు ఇస్తోన్న సంస్థల పనితీరుని గమనించండి. కొన్ని దుస్తుల్ని ప్రత్యేకంగా డిజైన్‌ చేయించి అందుబాటులో ఉంచుకోండి. ఒక్కోదానికి ఒక్కోధరను నిర్ణయించండి. ఓ వాట్సాప్‌ గ్రూప్‌ని ప్రారంభించి దాని ద్వారా దుస్తుల్ని అద్దెకు ఇవ్వడం మొదలుపెట్టండి. ఇలా ఓ ఆరునెలలు చేయగలిగితే...ఆ వ్యాపారంలోకి అడుగుపెట్టడం వల్ల ఎదురయ్యే కష్టనష్టాలు, లాభాలు తెలుస్తాయి. తరువాత పూర్తిస్థాయిలో వ్యాపారంగా మలచుకోవచ్చు. అప్పుడు ఓ బ్రాండ్‌నేమ్‌ తప్పనిసరి. మీ కంపెనీకి మీరు సోల్‌ ప్రొప్రయిటర్‌గా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. ఆన్‌లైన్‌ వ్యాపారం కాబట్టి జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. కంపెనీ పేరుమీద ఒక కరెంట్‌ అకౌంట్‌ తీసుకుని సంస్థ లావాదేవీలు మొదలుపెట్టవచ్చు. సంస్థ పేరుమీద వెబ్‌సైట్‌, యాప్‌లను తయారు చేయించుకోవాలి. గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం వంటి వాటి ద్వారా ప్రచారం చేయడానికి తగిన ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవాలి. ఇందుకోసం కొన్నాళ్లపాటు కనీసం నెలకు పదిహేనువేల రూపాయలు ఖర్చవుతాయి. పూర్తిస్థాయిలో సంస్థ, వార్డ్‌రోబ్‌ సిద్ధం చేసుకునేందుకు దుస్తుల డిజైనింగ్‌ కోసం ఐదారులక్షల రూపాయలు, వెబ్‌సైట్‌, యాప్‌ డెవలప్‌మెంట్‌ కోసం మరో రెండు లక్షలు అవసరం. బొటిక్‌లతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల కొంతమేర ఖర్చు తగ్గించుకోవచ్చు. వినియోగదారుల నుంచి తిరిగి వచ్చిన దుస్తుల్ని శుభ్రపరచడం, భద్రపరచడం వంటివాటికీ కొంత ఖర్చవుతుంది.
ఇంటి దగ్గరే ఉండి ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలనుకున్న మహిళలకు ఇది చక్కని అవకాశం. వ్యాపారం చేయాలనుకున్నా, మార్కెటింగ్‌లో మెలకువలు తెలుసుకోవాలనుకున్నా, కొత్త అంశాల్లో శిక్షణ తీసుకోవాలనుకున్నా... మీకున్న సందేహాలను మాకు పంపించండి. వాటికి సమాధానాలు అందించే ప్రయత్నం మేం చేస్తాం! మా చిరునామా...
email: vasundhara@eenadu.net


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.