
తాజా వార్తలు
కోల్కతా: కశ్మీర్ లోయలో అసమ్మతి తెలిపే గొంతులను భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అణచివేస్తోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ముఖ్యమైన సంస్థలకు అధిపతులుగా తమకు అనుకూల వ్యక్తులను ప్రభుత్వం నియమించుకుంటోందని విమర్శించారు. కోల్కతాలో బుధవారం నిర్వహించిన విద్యార్థుల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ మరోసారి కేంద్రంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నందుకు తనను అరెస్ట్ చేసినా.. భాజపాకు తాను మోకరిల్లబోనని ఉద్ఘాటించారు.
కశ్మీర్లో ఏంజరుగుతుందో తెలీకుండా గళమెత్తేవారిని కేంద్రం అణచివేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలకు అధిపతులుగా రిటైర్డ్ వ్యక్తులను నియమిస్తున్నారని, వారు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నారని చెప్పారు. దేశం అధ్యక్ష పాలనవైపుగా పయనిస్తోందని, అదే జరిగితే ప్రజాస్వామ్యానికి చోటుండదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకులను కేంద్రం బెదిరిస్తోందని, లేదంటే డబ్బుతో కొనుగోలు చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
