close

తాజా వార్తలు

కోడెల కుమారుడి షోరూం లైసెన్స్‌ రద్దు

గుంటూరు: ఏపీ శాసనసభ మాజీసభాపతి కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామకృష్ణకు చెందిన గౌతమ్ ఆటోమోటివ్స్ షోరూం లైసెన్స్‌ను రవాణా శాఖ రద్దు చేసింది. ఏపీ మోటార్ వాహనాల చట్టంలోని నిబంధన 84 ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు గుంటూరు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ మీరా ప్రసాద్ వెల్లడించారు. ఈ నెల ఆగస్టు 2న రవాణా శాఖ అధికారులు షోరూంలో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పాటు ఈ ఏడాది ఆగస్టు 2 వరకు జరిపిన వాహన విక్రయాల్లో అవకతవకలు జరిగి ఎలాంటి లైఫ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ పన్ను కట్టకుండానే 1025 వాహనాలను విక్రయించినట్లు గుర్తించిన రవాణా శాఖ అధికారులు షోరూంను సీజ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ మోటారు వాహనాల చట్టం ప్రకారం షోరూం వ్యాపార అనుమతిని రద్దు చేశామని డీటీసీ మీరా ప్రసాద్ వెల్లడించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.