
తాజా వార్తలు
ముంబయి: దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. హార్దిక్ పాండ్య తిరిగి జట్టులోకి వచ్చాడు. అనూహ్యంగా టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీకి చోటు దక్కలేదు. అతడి బదులు యువ ఆటగాడు రిషభ్‌పంత్‌ని ఎంపిక చేశారు. ప్రపంచకప్‌లో టీమిండియా నిష్ర్కమణ తర్వాత ధోనీ వీడ్కోలుపై వార్తలెన్నో వచ్చాయి. వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు అతడిని ఎంపిక చేస్తారా లేదా అనే సందిగ్ధం ఏర్పడింది. ఐతే రెండు నెలలు దేశసేవ చేస్తానని ప్రకటించడంతో సందిగ్ధం వీడింది.
సైనిక విధులు పూర్తి చేసుకొని వచ్చిన ధోనీని దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపిక చేస్తారని భావించినా అలా జరగలేదు. మహీని ఎందుకు ఎంపిక చేయలేదో సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. ఎంపికకు అతడు అందుబాటులో లేడని వెల్లడించాడు. లెహ్ నుంచి వచ్చిన ధోనీ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో పర్యటిస్తున్నాడని తెలిసింది. దీంతో తాము ముందుకు పోవాల్సి వచ్చిందని ఎమ్మెస్కే పేర్కొన్నారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ధోనీకి అవకాశాలు ఇవ్వడం కష్టమేనని సమాచారం. అతడి స్థానంలో పంత్‌ను భవిష్యత్ కీపర్‌గా తీర్చిదిద్దాల్సిన అవసరముందని సెలక్షన్ కమిటీ భావిస్తోందట.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
