close

తాజా వార్తలు

మరోసారి మారనున్న మెట్రో డీపీఆర్‌!

వాస్తవానికి దగ్గరగా ఉండాలని సీఎం వ్యాఖ్య 
తేలికపాటి మెట్రోకు మోక్షం లేనట్లే? 
ఈనాడు, అమరావతి

విజయవాడ నగరానికి మెట్రో ప్రాజెక్టు మరింత జాప్యం కానుంది. ముచ్చటగా మూడోసారి సవివర నివేదిక తయారు కానుంది. ప్రస్తుతం రూపొందించిన తేలికపాటి మెట్రో ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్‌) అమలులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. విజయవాడ మెట్రో ప్రాజెక్టు వ్యయం భారీగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మెట్రో ప్రాజెక్టుపై మంగళవారం రాత్రి సీఎం వద్ద సమీక్ష జరిగింది. సిస్ట్రా సంస్థ రూపొందించిన డీపీఆర్‌ను సీఎం ముందు ఉంచారు. దీనికి సీఎం స్పందిస్తూ.. ‘ప్రాజెక్టు వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఊహా చిత్రాలు.. నేలవిడిచి సాము చేసేవిధంగా (హైప్‌) ఉండకూడదు’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సిస్ట్రా సంస్థ రూపొందించిన తేలికపాటి మెట్రో నిర్మాణానికి కిలోమీటరుకు సగటున రూ.366కోట్లు వ్యయం కానుంది. మొత్తం మెట్రో ప్రాజెక్టు పూర్తి కావాలంటే 2023 నాటికి ఉన్న ధరల ప్రకారం రూ.24,244కోట్లు వ్యయం కానుంది. ఇంత భారీ నిర్మాణ వ్యయంపై ముఖ్యమంత్రి ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత భారీ ప్రాజెక్టు చేపట్టే అవకాశం ఉందా..? అని ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రస్తుతం విజయవాడ నగరంలో జనాభా ప్రాతిపదికన వాస్తవానికి అనుగుణంగా మెట్రో ప్రాజెక్టు చేపడదామని స్పష్టం చేసినట్లు తెలిసింది. కొంతమంది అసలు ప్రస్తుత పరిస్థితుల్లో మెట్రో అనవసరమనే అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం సిస్ట్రా రూపొందించిన డీపీఆర్‌ పట్టాలెక్కే అవకాశం లేనట్లేనని సమాచారం. సీఎం దగ్గర మెట్రో ప్రాజెక్టుపై సమావేశం జరిగిన వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. అమరావతిలో భూమార్గంలో మెట్రో రైలు మార్గం ప్రతిపాదనపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అమరావతి మెట్రో రైలు కార్పోరేషన్‌ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. మళ్లీ మెట్రో కథ మొదటికే చేరిందన్న అభిప్రాయం వ్యక్తమైంది.

రూ.10కోట్లు అంతేనా..? 
తేలికపాటి డీపీఆర్‌ కోసం సిస్ట్రా సంస్థకు రూ.10కోట్లు వ్యయం చేశారు. దీనికి కెఎఫ్‌డబ్ల్యూ సంస్థ నిధులు అందజేసింది. మొదట ఉచితంగానే డీపీఆర్‌ అన్న సంస్థ తర్వాత గ్రాంటుగా తీసుకుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ డీపీఆర్‌ ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే అవకాశం లేదని అంటున్నారు. ముచ్చటగా మూడో సారి  డీపీఆర్‌ తయారు చేయాల్సిందేనంటున్నారు. మొదట డీఎంఆర్‌సీ (దిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌) డీపీఆర్‌ తయారు చేశారు. అదీ పట్టాలెక్కలేదు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.