close

తాజా వార్తలు

అదరగొట్టేశాడు: స్మిత్‌ డబుల్‌ సెంచరీ

మాంచెస్టర్‌: యాషెస్‌ టోర్నీలో ఇప్పటికే తన అద్వితీయమైన ఫామ్‌తో పరుగుల దాహం తీర్చుకుంటున్న ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ నాలుగో టెస్టులో డబుల్‌ సెంచరీ బాదేశాడు. మొత్తం 23 బౌండరీలు, రెండు సిక్స్‌లతో ఈ ఘనతను సాధించాడు. దీంతో ఇప్పటివరకు టెస్ట్‌ క్రికెట్‌లో స్మిత్‌ మూడు డబుల్‌ సెంచరీలు సాధించాడు. ఈ మూడూ ఇంగ్లాడ్‌ జట్టు పైనే సాధించడం విశేషం. స్మిత్‌ 211 పరుగుల తన వ్యక్తిగత స్కోర్‌ వద్ద డెన్లీ బౌలింగ్‌లో రూట్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో స్టార్క్‌(49*) లియాన్‌ (12*) పరుగులతో ఉన్నారు. ఆసీస్‌ స్కోరు 475/8కు చేరుకుంది. ముఖ్యంగా స్టార్క్‌ వరుస బౌండరీలు బాదుతూ వన్డే మ్యాచ్‌ను తలపిస్తున్నాడు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.