close

తాజా వార్తలు

ప్రజల దృష్టి మరల్చేందుకే చంద్రయాన్‌-2: మమత

అసెంబ్లీలో మమత వివాదాస్పద వ్యాఖ్యలు

కోల్‌కతా: చంద్రయాన్‌-2 మరికొద్ది గంటల్లో జాబిలి ఉపరితలంపై కాలుమోపనున్న నేపథ్యంలో పశ్చిమ బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ భాజపాపై విరుచుకుపడే దీదీ.. ఈసారి చంద్రయాన్‌ ప్రయోగాన్ని అడ్డుపెట్టుకొని ఆరోపణలు చేశారు. శుక్రవారం పశ్చిమ బంగాల్‌ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థ నేల చూపులు చూసేందుకు కారణమైన మోదీ ప్రభుత్వం ఆ తప్పును కప్పిపుచ్చుకొనేందుకు చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని అడ్డుపెట్టుకుంటోందని విమర్శించారు. దీనివల్ల ఏర్పడుతున్న ఉత్కంఠ వాతావరణంతో ప్రజలు ఆర్థిక వ్యవస్థ స్థితిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ‘‘చంద్రయాన్-2 ప్రయోగం దేశంలో మొదటిది. వారు అధికారంలోకి రాకముందు, ఇలాంటి మిషన్లు ఎప్పుడూ చేపట్టలేదు. ఇది ప్రస్తుత ఆర్థిక పరిస్థితి నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం.’’ అని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. బంగాల్‌ అసెంబ్లీలో జాతీయ పౌరుల నమోదు పట్టిక (ఎన్‌ఆర్‌సీ)పై చర్చ సందర్భంగా మమత ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే, ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దేశానికి ఖ్యాతి గడించిపెట్టే చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని అడ్డుపెట్టుకొని మమత రాజకీయాలు చేయడం తగదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇస్రో ఖ్యాతిని కీర్తించాల్సిందిపోయి తన వ్యాఖ్యలతో మమత అపఖ్యాతి మూటగట్టుకుంటున్నారని మరికొంత మంది అభిప్రాయపడ్డారు.

శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.30 నుంచి 2.30 ప్రాంతంలో చంద్రయాన్‌-2 వ్యోమనౌక చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్షణాల కోసం యావత్‌ దేశం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.