close

తాజా వార్తలు

మెగాస్టార్‌కి తమిళస్టార్‌ డబ్బింగ్‌..?

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తెలుగు, తమిళ, మలయాళంతోపాటు హిందీ భాషలలో ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తమిళ వెర్షన్‌లో చిరంజీవికి తమిళ స్టార్ అరవింద్ స్వామి డబ్బింగ్‌ చెప్పనున్నారని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
భారత స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడెక్షన్ కంపెనీ పతాకంపై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా తమిళ లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించనున్నారు. బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.