close

తాజా వార్తలు

ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు సన్‌ఫార్మా

ముంబయి: ఔషధరంగ దిగ్గజం సన్‌ఫార్మాలో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని సెబీ ఆదేశించింది. ఈ విషయాన్ని కంపెనీనే ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనిలో 2016, 2017, 2018 సంవత్సరాలకు సంబంధించిన లావాదేవీలను పరిశీలించనున్నారు. ఈ ఆదేశాల వెనుక ఉన్న కారణాలను వెల్లడించలేదు.  దీనికి సంబంధించిన పురోగతిని ఎప్పటికప్పుడు సెబీ నిబంధనలకు అనుగుణంగా మా వాటాదారులకు వెల్లడిస్తామని సన్‌ఫార్మా పేర్కొంది. 

ఈ కంపెనీలో కార్పొరేట్‌ పాలనలో అవకతవకలు చోటుచేసుకొన్నాయనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో సెబీ ఈ ఆదేశాలను జారీ చేయడం గమనార్హం. కొన్నాళ్ల కిందట  ఒక ప్రజావేగు దాదాపు 150 పేజీల ఫిర్యాదును సెబీకి అందజేశాడు. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. ఈ త్రైమాసికంలో సన్‌ఫార్మా లాభం 31శాతం పెరిగి రూ.1387కోట్లకు చేరింది. నికర అమ్మకాలు కూడా పెరిగి రూ.8,259 కోట్లకు చేరాయి. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.