
తాజా వార్తలు
దిల్లీ: పోలవరం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం మరోసారి లేఖ రాసింది. పోలవరం పరిణామాలపై నివేదిక పంపాలంటూ రెండు వారాల క్రితం ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో పీఎంవో రాసిన లేఖపై రెండు రోజుల్లోగా తగిన సమాధానం ఇవ్వాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వానికి సూచించింది.
పోలవరం వ్యవహారంలో రివర్స్‌టెండరింగ్‌కు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ప్రాజెక్టు అథారిటీ కేంద్రానికి సమగ్ర నివేదిక అందజేసింది. అనంతరం పోలవరం పరిణామాలు, రివర్స్ టెండరింగ్‌పై ప్రాజెక్టు అథారిటీ విముఖత ప్రదర్శించినా ముందుకెళ్లడం వెనుక ఉన్న ఆంతర్యమేంటనే దానిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరుతూ పీఎంవో లేఖ రాసింది. ఆ లేఖపై ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో తాజాగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఓపీ సిన్హా లేఖ రాశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- ఆ పాత్రకు అరవిందస్వామి అనుకున్నారట!
- ఎంజీ విద్యుత్తు కారు విశేషాలు ఇవే..
- ఇంటి వరకూ తోడుగా వస్తారు!
- మీ షేర్లు భద్రపర్చుకోండిలా..!
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ఎందుకా పైశాచికం?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
