
తాజా వార్తలు
డల్లాస్: అమెరికాలో స్థిరపడిన భారతీయుల కోసం అక్కడి ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఏఎఫ్‌సీ) ‘సామాజిక భద్రత’పై కార్యశాల నిర్వహించింది. సెప్టెంబర్ 7న డల్లాస్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐఏఎఫ్‌సీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి సామాజిక భద్రతా విభాగానికి చెందిన ప్రజా సంబంధాల నిపుణురాలు ఆంగీ హోక్వాంగ్ను ఆహ్వానించారు. వంద మందికిపైగా భారతీయ అమెరికన్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆమె అందరికీ సామాజిక భద్రత గురించి వివరించారు. అనంతరం వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆమె సమాధానం ఇచ్చారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన మిచిగాన్ రాష్ట్ర ప్రతినిధి పద్మ కుప్ప మాట్లాడారు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఐఏఎఫ్‌సీ అధ్యక్షుడు డాక్టర్ తోటకూర ప్రసాద్‌ను అభినందించారు. అనంతరం ఆంగీ హోక్వాంగ్తో పాటు, కుప్ప పద్మలను ప్రసాద్ తోటకూర, ఉపాధ్యక్షుడు తయాబ్ కుందవాలా సన్మానించారు. ఆ తర్వాత పద్మ యూఎస్‌లోని అతి పెద్ద మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించారు. ఆమె వెంట కమ్యూనిటీ నాయకుడు సుబ్బు జొన్నలగడ్డ తదితరులు ఉన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఉతికి ఆరేశారు
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- దిశకు తల్లిదండ్రులతో సఖ్యత లేదేమో!
- అసలు కాల్పులు అక్కడే జరిగాయా?
- టీమిండియా సమష్టి విజయం
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
