close

తాజా వార్తలు

కాణిపాకంలో అగ్ని ప్రమాదం

కాణిపాకం: చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక ఆలయానికి 200 మీటర్ల దూరంలో ఉన్న ప్రైవేటు వ్యక్తికి చెందిన లడ్డూ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. కాణిపాకానికి చెందిని ఓ ప్రైవేటు వ్యక్తి అర్ధగిరి ఆలయానికి లడ్డూ ప్రసాదాలు తయారు చేసి విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం లడ్డూ తయారు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ కమ్ముకుంది. స్థానికులు వెంటనే మంటలను అదుపు చేశారు. ఈ సంఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు. అనంతరం సంఘటనా ప్రదేశానికి చేరుకున్న అగ్నిమాసక సిబ్బంది ఉన్న కాస్త మంటలను అదుపు చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.