close

తాజా వార్తలు

రిటైర్మెంట్‌ తీసుకున్న‘అలీబాబా’ జాక్‌మా

బీజింగ్‌: చైనీస్‌ ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు, కంపెనీ ఛైర్మన్‌ జాక్‌ మా తన పదవి నుంచి తప్పుకున్నారు. ముందుగా చెప్పినట్లుగానే మంగళవారం తన 55వ పుట్టినరోజున ఆయన రిటైర్మెంట్‌ తీసుకున్నారు. అయితే ఛైర్మన్‌ పదవిని వీడినప్పటికీ ‘అలీబాబా పార్ట్‌నర్‌షిప్‌’ గ్రూప్‌లో సభ్యుడిగా కొనసాగనున్నారు. కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలో మెజార్టీ సభ్యులను నామినేట్‌ చేసే హక్కు ఈ గ్రూప్‌కు ఉంటుంది. 

నిజానికి జాక్‌ మా తన రిటైర్మెంట్‌ గురించి ఏడాది క్రితమే ప్రకటించారు. సెప్టెంబరు 10, 2018న తన 54వ పుట్టినరోజున పదవీ విరమణ చేస్తానని గతేడాది వెల్లడించారు. అయితే సంస్థ అవసరాల రీత్యా మరో ఏడాది పాటు ఛైర్మన్‌గా కొనసాగాలని కంపెనీ కోరడంతో ఇప్పటి వరకు ఆయన పదవిలో ఉన్నారు. నేడు ఛైర్మన్‌ హోదా నుంచి తప్పుకున్నారు. అయితే అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో ఇ-కామర్స్‌ రంగంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న ఇలాంటి సమయంలో జాక్‌ మా పదవీ విరమణ చేయడం గమనార్హం.

ఇంగ్లిష్ టీచర్‌ అయిన జాక్‌ మా 1999లో ఇ-కామర్స్‌ రంగంలోకి అడుగుపెట్టి అలీబాబాను స్థాపించారు. తక్కువ కాలంలోనే ఈ సంస్థ వేగంగా అభివృద్ధి చెంది బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. 2013లో సీఈవో పదవి నుంచి జాక్‌ మా తప్పుకున్నారు. ఆ తర్వాత నుంచి ఛైర్మన్‌గా కొనసాగిన ఆయన నేడు ఆ హోదా నుంచి వైదొలిగారు. ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన జాక్‌ మా సంపద ప్రస్తుతం 41.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.