Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009212
            [news_title_telugu_html] => 

ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజు: చంద్రబాబు

[news_title_telugu] => ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజు: చంద్రబాబు [news_title_english] => chandrababu fires on ycp govt [news_short_description] => నిర్బంధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి వెళ్లకుండా... [news_tags_keywords] => tdp,chandrababu,guntur,ap news [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => Wp6ZgjS5mHk [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 08:50:15 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజు: చంద్రబాబు - chandrababu fires on ycp govt - EENADU
close

తాజా వార్తలు

ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజు: చంద్రబాబు

అమరావతి : నిర్బంధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి వెళ్లకుండా చంద్రబాబును పోలీసులు ఈ ఉదయం గృహనిర్బంధం చేశారు. దీంతో ఆయన నివాసంలోనే నిరాహార దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో తెదేపా నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రశ్నించే గొంతును నొక్కడం ప్రజాస్వామ్యమా? అని నిలదీశారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం దుర్మార్గమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజని పేర్కొన్నారు. పునరావాస శిబిరానికి ఆహారం సరఫరా అడ్డుకుంటారా? అని మండిపడ్డారు. శిబిరాల్లో బాధితులకు ఇచ్చే ఆహారం అడ్డుకోవడం అమానుష చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల పట్ల ఇంత నిర్దయగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. ఒక పవిత్ర లక్ష్యం కోసం తాము పోరాటం చేస్తున్నామని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. సొంత ఊళ్లో నివసించే హక్కు కోసం చేస్తున్న పోరాటమన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. న్యాయం చేయాలని కోరితే తెదేపాపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. మనం నిరంకుశ పాలనలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని నిలదీశారు. వైకాపా ప్రభుత్వ దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసన చేయాలని కార్యకర్తలను కోరారు. బాధితులకు న్యాయం జరిగేవరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. 

చలో ఆత్మకూరు నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రాకుండా పోలీసులు తెదేపా నేతలు,కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.

 

 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.