Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009240
            [news_title_telugu_html] => 

యాసిన్‌ మాలిక్‌పై అక్టోబరు 1న విచారణ

[news_title_telugu] => యాసిన్‌ మాలిక్‌పై అక్టోబరు 1న విచారణ [news_title_english] => Trial in 1990 case of killing of IAF personnel on october 1 [news_short_description] => దాదాపు 30ఏళ్ల క్రితం నలుగురు వాయుసేన సిబ్బందిని హత్య చేసిన కేసులో జేఎక్‌ఎల్‌ఎఫ్‌ సంస్థ అధినేత యాసిన్ మాలిక్‌ విచారణ ఎదుర్కోనున్నాడు. 1990 నాటి ఈ కేసుపై జమ్మూలోని టాడా [news_tags_keywords] => Yasin Malik,JKLF,IAF personnel [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 15:32:31 [news_isactive] => 1 [news_status] => 2 ) )
యాసిన్‌ మాలిక్‌పై అక్టోబరు 1న విచారణ - Trial in 1990 case of killing of IAF personnel on october 1 - EENADU
close

తాజా వార్తలు

యాసిన్‌ మాలిక్‌పై అక్టోబరు 1న విచారణ

జమ్ము: దాదాపు 30ఏళ్ల క్రితం నలుగురు వాయుసేన సిబ్బందిని హత్య చేసిన కేసులో జేఎక్‌ఎల్‌ఎఫ్‌ సంస్థ అధినేత యాసిన్ మాలిక్‌ విచారణ ఎదుర్కోనున్నాడు. 1990 నాటి ఈ కేసుపై జమ్మూలోని టాడా కోర్టులో అక్టోబరు 1న విచారణ జరపనుంది. 

నాడు ఏం జరిగిందంటే..

1990లో గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు జనవరి 25న శ్రీనగర్‌ శివారులో వాయుసేన సిబ్బందిపై భీకర దాడి జరిగింది. కారులో వచ్చిన కొంతమంది ఉగ్రవాదులు సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో స్క్వాడ్రన్‌ లీడర్‌ రవి ఖన్నా సహా మరో ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. 

పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముష్కరుల్లో ఒకరు యాసిన్‌ మాలిక్‌గా ప్రత్యక్ష సాక్షులు గుర్తించారు. దీంతో ఈ దాడిలో మాలిక్‌ను ప్రధాన సూత్రధారిగా పేర్కొంటూ సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఆ తర్వాత అతడిని అరెస్టు చేయగా.. 1994లో బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే శ్రీనగర్‌లో టాడా కోర్టు లేకపోవడంతో 1995లో మాలిక్‌ కేసు విచారణపై జమ్ముకశ్మీర్‌ హైకోర్టు స్టే విధించింది. అనంతరం కేసును జమ్ములోని టాడా కోర్టుకు బదిలీ చేశారు. ఆ తర్వాత కాలంలో మాలిక్‌ ఉగ్రవాదాన్ని వీడాడు. ఈ కేసులో ఇటీవల అతడిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. ఈ రోజు అతడిని కోర్టులో హాజరుపర్చగా.. కేసు విచారణను టాడా కోర్టు అక్టోబరు 1వ తేదీకి వాయిదా వేసింది. 

యాసిన్ మాలిక్‌ జమ్ముకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌(జేకేఎల్‌ఎఫ్‌) సంస్థకు అధినేత. ఈ సంస్థ వేర్పాటువాదుల కార్యకలాపాలకు ప్రోత్సాహం అందిస్తుందన్న ఆరోపణలతో ఈ సంస్థపై నిషేధం విధించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.