Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009275
            [news_title_telugu_html] => 

మార్కెట్‌లోకి బీఎస్‌-VI హొండా యాక్టివా 125

[news_title_telugu] => మార్కెట్‌లోకి బీఎస్‌-VI హొండా యాక్టివా 125 [news_title_english] => Honda Activa 125 BS6 launched at Rs 67490 [news_short_description] => ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీదారు హోండా మోటార్‌ సైకిల్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) బీఎస్‌-VI ప్రమాణాలు కలిగిన కొత్త యాక్టివా 125ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. మొత్తం మూడు వేరియంట్లలో ఇది లభించనుంది. 2020 ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-VI ప్రమాణాలు కలిగిన .... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 16:20:27 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మార్కెట్‌లోకి బీఎస్‌-VI హొండా యాక్టివా 125 - Honda Activa 125 BS6 launched at Rs 67490 - EENADU
close

తాజా వార్తలు

మార్కెట్‌లోకి బీఎస్‌-VI హొండా యాక్టివా 125

న్యూదిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీదారు హోండా మోటార్‌ సైకిల్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) బీఎస్‌-VI ప్రమాణాలు కలిగిన కొత్త యాక్టివా 125ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. మొత్తం మూడు వేరియంట్లలో ఇది లభించనుంది. 2020 ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-VI ప్రమాణాలు కలిగిన వాహనాలను కేంద్రం తప్పనిసరి చేసిన నేపథ్యంలో హోండా ఈ కొత్త వాహనాన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

యాక్టివా 125 బీఎస్‌-VI మోడల్‌ ప్రారంభ ధరను రూ.67,490 (ఎక్స్‌ షోరూమ్‌, దిల్లీ)గా నిర్ణయించింది. యాక్టివా 125 అల్లాయ్‌ వీల్‌ మోడల్‌ ధర రూ.70,990 కాగా.. యాక్టివా 125 డీలక్స్‌ ధర రూ.74,990గా కంపెనీ నిర్ణయించింది. యాక్టివా కొత్త ఇంజిన్‌ 6500 ఆర్‌పీఎం వద్ద 8.1 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. గత మోడల్స్‌లానే ఇందులో హోండా ఎకో టెక్నాలజీ (హెచ్‌ఈటీ)ని అందిస్తున్నారు. బీఎస్‌-VI ప్రమాణాలు కలిగిన ఈ వాహనంలో బీఎస్‌-IV ఇంధనాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.

యాక్టివా కొత్త మోడల్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, ఎల్‌ఈడీ పొజిషినింగ్‌ ల్యాంప్‌ను అమర్చారు. దీంతో పాటు ఇంధనాన్ని నింపే లిడ్‌ను ఈసారి వెనుకవైపు అమర్చారు. కొత్త యాక్టివాలో డిజిటల్‌ ప్యానెల్‌ను అమర్చారు. ఒక్క స్పీడ్‌ మినహా మిగిలినవన్నీ ఇందులో చూసుకోవచ్చు. మొత్తం మూడు రంగుల్లో ఈ స్కూటీ లభ్యమవుతుంది. మూడేళ్ల వారెంటీని కంపెనీ అందిస్తోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.