Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009725
            [news_title_telugu_html] => 

రాజధాని నిర్మాణంపై చేతులెత్తేస్తారా:యనమల

[news_title_telugu] => రాజధాని నిర్మాణంపై చేతులెత్తేస్తారా:యనమల [news_title_english] => Yamala pressmeet at amaravati [news_short_description] => ఆంధ్రప్రదేశ్‌ కలల రాజధాని అమరావతిని తాము అభివృద్ధి చేయలేమని ఆర్థిక మంత్రి బుగ్గన చేతులెత్తేశారని మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. రాజధాని అభివృద్దికి [news_tags_keywords] => Yanamala, TDP, Amaravati [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 11:56:13 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రాజధాని నిర్మాణంపై చేతులెత్తేస్తారా:యనమల - Yamala pressmeet at amaravati - EENADU
close

తాజా వార్తలు

రాజధాని నిర్మాణంపై చేతులెత్తేస్తారా:యనమల

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కలల రాజధాని అమరావతిని తాము అభివృద్ధి చేయలేమని ఆర్థిక మంత్రి బుగ్గన చేతులెత్తేశారని మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. రాజధాని అభివృద్దికి నిధులు లేవని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. విదేశీ పర్యటనల్లో కూడా ఏపీ ప్రతిష్ఠ పెంచే చర్యలు చేపట్టకుండా పెట్టుబడులు అడ్డుకునేలా వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడ్డారు. అమరావతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అమరావతికి నిధులు లేవని చెప్పడం వైకాపా ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేసిందని యనమల విమర్శించారు.  అభివృద్ది వికేంద్రీకరణ చేస్తామని చెప్పడం కొత్తదేమీ కాదని, తెదేపా పాలనలో జరిగింది అభివృద్ధి వికేంద్రీకరణేనని చెప్పారు. ప్రపంచ బ్యాంకు, ఆసియన్‌ బ్యాంకు రుణాలు పోగొట్టి...ఇప్పుడు అమరావతికి నిధులు లేవని చేతులెత్తేస్తారా? అని నిలదీశారు. ఇంతకన్నా దివాలాకోరుతనం ఏముంటుందని మండిపడ్డారు. గతంలో తెదేపా ప్రభుత్వం అటు అమరావతిని, ఇటు 13 జిల్లాల అభివృద్దిని సమ ప్రాధాన్యతతో అభివృద్ధి చేసినప్పుడు ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం ఎందుకలా చేయలేకపోతోందని ప్రశ్నించారు. 

చంద్రబాబు నిర్బంధంపై డీజీపీ సవాంగ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్న యనమల..ఉద్రిక్తతలు పెరుగుతాయని మాజీ సీఎం ఇంటి గేట్లకు తాళ్లు కట్టామని సమర్ధిస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
ప్రశాంతంగా, శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలను పోలీసు బలగాలతో అణచి వేయాలని చూశారని మండిపడ్డారు. సెక్షన్ 140, సెక్షన్ 30 లేనిచోట్ల తెదేపా నేతలను ఎలా నిర్భందిస్తారని యనమల ప్రశ్నించారు. ప్రశ్నించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.