
తాజా వార్తలు
హోసూరు: అడవుల విధ్వంసం వలన మనుషులతో పాటు వన్య ప్రాణులకు ఎంతో అపార నష్టం కలుగుతున్నమాట ఎవరు కాదనలేని సత్యం. సమస్త విశ్వంలో మనిషి మనుగడ ఎంత కీలకమో
వన్య ప్రాణులు మనుగడ కూడ అంతే కీలకం. కాని అడవుల నాశనం కారణంగా ఎన్నో సందర్బాలలో వన్య ప్రాణులు దారి తప్పి జనావాసాల్లోకి రావడం మనం చూసే ఉంటాం. అలా దారి తప్పి
జనావాసాలలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు తిరిగి అడవిలోకి ఎలా వెళ్లాలో తెలియక గోడదూకిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హోసూర్ లో జరిగింది.
దీనికి సంబందించిన వీడియోని ప్రవీణ్ కస్వన్ అనే ఫారెస్ట్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. రోడ్డుకి ఇరువైపుల గోడ ఉండటంతో ఏనుగుల గుంపు ఎటువెళ్ళాలో తెలియక అక్కడే ఉన్న
ఎత్తైన గోడ దూకేందుకు ప్రయత్నించాయి. పెద్ద గోడ దూకడానికి సాధ్యం కాకపోవటంతో తక్కువ ఎత్తు ఉన్న వైపు వెళ్లి గోడ దూకి అడవిలోకి వెళ్ళాయి. ఈ గుంపులో ఉన్న చిన్న ఏనుగుకు గోడ
దూకడం కష్టతరం కావటంతో వెనకే ఉన్న పెద్ద ఏనుగు దానిని ముందుకు నెట్టటం కూడ మనం ఈ వీడియో లో చూడవచ్చు. ఈ వీడియోని చూసిన నెటిజన్లలో ఒకరు ‘మనుషులమైన మనం ఈ
పరిస్థితి వాటికి కల్పించినందుకు ఎంతో సిగ్గు పడాలి’ అని కామెంట్ చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- శరణార్థులకు పౌరసత్వం
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- భాజపాకు తెరాస షాక్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
