
తాజా వార్తలు
కోల్‌కతా: సుమారు మూడు దశాబ్దాల కిందటి నాటి కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి చేసిన వ్యక్తి నిర్దోషిగా బయటపడ్డాడు. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ స్థానిక కోర్టు తీర్పు వెలువరించింది. దాడి చేసిన వ్యక్తి ఆ తర్వాతి కాలంలో సీఎం అయినప్పటికీ అతడిపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకోకపోవడం ఇక్కడ గమనార్హం. దీంతో దాడి చేసిన వ్యక్తి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
అది 1990 ఆగస్టు 16. అప్పట్లో మమతా బెనర్జీ యువజన కాంగ్రెస్ నేతగా ఉన్న సమయంలో ఆమెపై దాడి జరిగింది. వామపక్ష పార్టీకి చెందిన ఆలమ్ దీదీపై కర్రతో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కొన్ని వారాల పాటు ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందింది. ఈ కేసులో 1994లో మమత అలీపోర్ కోర్టులో సాక్ష్యం చెప్పారు కూడా. కాలచక్రం గిర్రున తిరిగింది. 2011లో తృణమూల్ అధినేత్రి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూలదోసి సీఎం పీఠాన్ని అధిష్ఠించారు.
అయితే, అప్పటి ఘటనకు సంబంధించిన కేసు మాత్రం కోర్టులో ఇంకా కొనసాగుతూనే ఉంది. దాడి కేసులో నిందితుల్లో కొందరు కనిపించకుండా పోగా.. మిగిలిన వారు మరణించారు. ఈ నేపథ్యంలో సరైన ఆధారాల్లేని కారణంగా ఆలమ్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసును కొనసాగించడం వల్ల డబ్బు దుర్వినియోగం తప్ప కొత్తగా సాధించేదీ లేనందున ఇంతటితో ఈ కేసుకు చరమగీతం పాడాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు బెంగాల్ ప్రభుత్వం తరఫు న్యాయవాది రాధాకృష్ణ ముఖర్జీ తీర్పు అనంతరం మీడియాతో అన్నారు. ఓ సందర్భంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాక్షమిచ్చేందుకు మమతా బెనర్జీ ముందుకొచ్చారని ఆ తర్వాత రద్దు చేసుకున్నారని తెలిపారు.
29 ఏళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడిన ఆలమ్ ఆనందానికైతే అవధుల్లేవు. తన సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలో అర్థం కావడం లేదన్నాడు. తాను దాడి చేసిన వ్యక్తి అనంతర కాలంలో సీఎం అయ్యారని, ఆమె ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే 2011 (అధికారం చేపట్టిన ఏడాది)లోనే ఓ నిర్ణయం తీసుకునేవారని అన్నాడు. ఇకపై తన పనిపై తాను దృష్టి సారిస్తానని పేర్కొన్నాడు. కోర్టు తీర్పునకు ముందు ఓ సందర్భంలో తనను సీఎం క్షమిస్తారని అనుకుంటున్నట్లు వెల్లడించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
