
తాజా వార్తలు
హైదరాబాద్: ఎట్టి పరిస్థితుల్లోనూ తెరాసను వీడేది లేదని నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పష్టం చేశారు. గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను భాజపాలో చేరుతున్నట్లు వస్తున్న
వార్తలను ఖండించారు. ‘‘ కేసీఆర్ నాకు మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. కేసీఆర్ నాకు పొలిటికల్ గాడ్ ఫాదర్. ఎట్టి
పరిస్థితుల్లో తెరాసను వీడను...బతికినంతకాలం తెరాసలోనే కొనసాగుతా. జీవితమంతా కేసీఆర్‌కు రుణపడి ఉంటా. మంత్రి పదవి కావాలని కేసీఆర్‌ను ఎప్పుడూ అడగలేదు’’ అని పేర్కొన్నారు.
ఈరోజు మధ్యాహ్నం ఎమ్మెల్యే షకీల్ హైదరాబాద్‌లో నిజామాబాద్ ఎంపీ డి.అర్వింద్‌ను ఆయన నివాసంలో కలిశారు. దీంతో షకీల్ భాజపాలో చేరతారనే ప్రచారం జరిగింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో
స్థానం దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న షకీల్ భాజపా వైపు చూస్తున్నారని మీడియాలో కథనాలు రావడంతో గురువారం రాత్రి ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘నా జీవితంలో అది భయంకరమైన జ్ఞాపకం’
- గొల్లపూడి తీరని కోరిక..!
- మాది గురుశిష్యుల సంబంధం
- ఎన్టీఆర్.. నానిలతో సినిమా చేయాలని ఉంది!
- గొల్లపూడి మారుతీరావు కన్నుమూత
- రజనీ..జీవితంలో మర్చిపోలేని ఘటన అది!
- పట్టు చుట్టండి
- అతడు నిప్పు ఆమె మంచు
- ఈ మిలీనియల్స్ నాకు అర్థం కావట్లేదు!
- తెల్లసొన తెచ్చే మెరుపు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
