
తాజా వార్తలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై వాడీవేడి చర్చ
హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మంత్రి హరీశ్‌రావు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య రసవత్తర చర్చ సాగింది. కాళేశ్వరానికి జాతీయ హోదా దక్కని పాపం కాంగ్రెస్‌దేనని హరీశ్‌రావు ఆరోపిస్తే.. ప్రాజెక్టుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే అసలు విషయం బయటపడుతుందని జీవన్‌రెడ్డి ఎదురుదాడి చేశారు. విభజన చట్టంలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి ప్రాణహిత చేవేళ్లకు జాతీయ హోదా ఎందుకు విస్మరించారని హరీశ్‌రావు నిలదీశారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిని కలిసి అన్ని ప్రాజెక్టుల గురించి విజ్ఞప్తి చేశారని మంత్రి గుర్తు చేశారు. అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖలు కూడా రాశామని, ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలని ప్రశ్నించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేసిన విషయాన్ని వారి పేర్లతో సభాముఖంగా తానే వెల్లడించినట్లు హరీశ్‌రావు గుర్తు చేశారు.
పార్లమెంట్లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కాళేశ్వరంపై ప్రశ్నించారని జీవన్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తులూ రాలేదని రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటించారని జీవన్‌రెడ్డి చెప్పారు. అంతిమంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థికభారం ప్రజలపై పడుతోందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. భవిష్యత్‌లో సామాన్యులపై ఆర్థికభారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- పెళ్లే సర్వం, స్వర్గం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
