close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. తెలంగాణలో మళ్లీ బలపడదాం: చంద్రబాబు

తెలంగాణలో తెదేపాను మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలంగాణలో నూతన నాయకత్వం తయారవ్వాలన్నారు. తెదేపా ఆవిర్భవించింది హైదరాబాద్‌లోనేనని, అందుకే పార్టీకి ఇక్కడ పునర్‌ వైభవం తీసుకురావాలని సూచించారు. హైదరాబాద్‌ విచ్చేసిన ఆయన ఎన్టీఆర్‌ భవన్‌లో పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో శనివారం భేటీ అయ్యారు. తాజా రాజకీయాలు, తెలంగాణలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. లాడెన్‌ కొడుకు మృతి వాస్తవమే..

అల్‌-ఖైదా ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ కుమారుడు హమ్జా బిన్‌ లాడెన్‌ మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ధ్రువీకరించారు. అఫ్గానిస్థాన్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో అమెరికా సైన్యం చేపడుతున్న ఉగ్రవాద నిరోధక చర్యల్లో అతను హతమైనట్లు ట్రంప్‌ చెప్పారు. ఈ మేరకు ట్రంప్‌ వ్యాఖ్యలతో కూడిన ఓ ప్రకటనను శ్వేత సౌధం విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. రేవంత్‌కు పవన్‌ ఫోన్‌

కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఫోన్‌ చేశారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సోమవారం ఉదయం 10 గంటలకు దస్పల్లా హోటల్‌లో నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశంలోపాల్గొనాలని ఆహ్వానించారు. పవన్‌ ఆహ్వానానికి రేవంత్‌ అంగీకరించారు. వీహెచ్‌ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. రాయలసీమకు ప్రత్యేక బోర్డు: కన్నా

రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ కరవు పరిస్థితిపై ఇప్పటికీ స్పందించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమలో పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టల పనులు వెంటనే చేపట్టాలని కన్నా డిమాండ్‌ చేశారు. ఈ ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వానికి సహకరించి స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. రాయలసీమ జిల్లాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రాయలసీమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఆసియా కప్‌ విజేతగా యువ భారత్‌

ఉత్కంఠ భరితంగా సాగిన అండర్‌-19 ఆసియాకప్‌ ఫైనల్లో యువ భారత్‌ విజయం సాధించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తుదిపోరులో టీమిండియా ఐదు పరుగుల తేడాతో గెలిచింది. అధర్వకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, భారత ఓపెనర్ అర్జున్ అజాద్‌కు మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్ దక్కాయి. యువ భారత్‌కు ఇది ఏడో ఆసియా కప్‌ టైటిల్‌. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ‘మా’కు రాజశేఖర్‌ భారీ విరాళం

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’కు డా.రాజశేఖర్‌ రూ.10 లక్షల విరాళం అందజేశారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు గడిచిన విషయం తెలిసిందే. అయితే ‘మా’ ఎన్నికల సమయంలో సభ్యులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నూతన కార్యవర్గం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ హామీల అమలు కోసం అసోసియేషన్‌లో ఉన్న మూలధనాన్ని ఖర్చుచేయడం సరికాదని భావించిన ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రాజశేఖర్‌ తన వంతుగా రూ.10 లక్షలను విరాళంగా ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. టెన్నిస్‌ స్టార్‌కు wwe ఛాంపియన్‌ బెల్ట్‌

ఇటీవల యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన కెనడా యువతి బియాంక ఆండ్రీస్కుకి డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్‌ బెల్టు బహుమతిగా లభించింది. ఈ విషయాన్ని తెలుపుతూ బియాంక ఆ బెల్టుతో దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్టుచేసింది. ఈ సందర్భంగా డబ్ల్యూడబ్ల్యూఈకి ధన్యవాదాలు చెప్పింది. ఆ బెల్టుపై బియాంక పూర్తి పేరుతో సహా యూఎస్‌ ఓపెన్‌ లోగోని కూడా ముద్రించడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. జగన్‌పై సొంత పార్టీలోనే వ్యతిరేకత: చంద్రబాబు

జగన్‌ వ్యక్తిత్వంతో రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరని మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. సొంత పార్టీలోనే జగన్‌ తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. జాతీయ మీడియా సైతం జగన్‌ విధానాలను తప్పుబట్టిందని పేర్కొన్నారు. పార్టీ నేతలతో చంద్రబాబు శనివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాజధాని అమరావతిపై ప్రజల్లో సైతం చర్చ జరుగుతోందన్నారు. వారిలో ఆందోళన వ్యక్తమవుతోందని చెప్పారు. మనకంటూ ఓ నగరం లేకపోతే బిడ్డల భవిష్యత్‌ ఎలా? అనే ఆవేదన వారిలో ఉందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. నల్లమలను నాశనం చేయొద్దు: సురేష్‌ బాబు

నల్లమల అటవీ ప్రాంతంలో చేపట్టబోతున్న యురేనియం తవ్వకాల వల్ల అనేక అనర్థాలు జరుగుతాయంటూ పలువురు నటులు, సినీ దర్శకలు గళమెత్తుతున్నారు. దీనివల్ల కలిగే అనర్థాల గురించి కొందరు ట్విటర్‌, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు స్పందించారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై చేపట్టిన సామాజిక ఉద్యమానికి ఆయన మద్దతు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. యాషెస్‌ కాపాడుకునేందుకు కాదు..

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న యాషెస్‌ సిరీస్‌ను కాపాడుకునేందుకు రాలేదని, తాము కచ్చితంగా గెలిచేందుకే వచ్చామని ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ పేర్కొన్నాడు. శుక్రవారం రెండో రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడిన అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘ఇంగ్లాండ్‌ కన్నా మేం 78 పరుగులే వెనుకబడి ఉన్నాం. గతంలో ఇలాంటి స్కోర్‌ నుంచి కోలుకొని మ్యాచ్‌లు గెలిచిన అనుభవం మాకుంది. ఇది యాషెస్‌ సిరీస్‌, ఇక్కడ గెలవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని స్మిత్‌ స్పష్టంచేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.