close

తాజా వార్తలు

కుప్పకూలిన డీఆర్‌డీవో డ్రోన్‌

బెంగళూరు: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)కు చెందిన ఓ డ్రోన్‌ మంగళవారం కుప్పకూలింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు తెలిపారు. 

చిత్రదుర్గ సమీపంలో డీఆర్‌డీవో ఓ టెస్ట్‌ రేంజ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. చల్లకెరె ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌ పేరుతో మానవరహిత, మానవసహిత ఎయిర్‌క్రాఫ్ట్‌ల ప్రయోగాల కోసం ప్రత్యేకంగా దీన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ టెస్ట్‌ రేంజ్‌ నుంచి రుస్తుమ్‌-2 డ్రోన్‌ టెస్ట్‌ ట్రయల్‌ నిర్వహించింది. అయితే ట్రయల్‌ విఫలమవడంతో ఆ డ్రోన్‌ జోడిచిల్లెనహళ్లి గ్రామంలోని పంటపొలాల్లో కూలిపోయింది. కాగా ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. 

ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఏమై ఉంటుందా అని గ్రామస్థులు పెద్ద ఎత్తున ఘటనాస్థలంలో గుమిగూడారు. కొందరు ఫొటోలు, వీడియోలు తీశారు. డ్రోన్‌ కూలిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రజలను అక్కడినుంచి పంపించేశారు. డ్రోన్‌ కూలిన ప్రాంతానికి డీఆర్‌డీవో అధికారులు వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.