
తాజా వార్తలు
దిల్లీ: దేశవాళీ క్రికెట్లో ప్రతిష్ఠాత్మకమైన విజయ్ హజారే ట్రోఫీలో ధావన్, పంత్, సైని దిల్లీ తరఫున బరిలోకి దిగనున్నారని దిల్లీ క్రికెట్ బోర్డు (డీడీసీఏ) తెలిపింది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 13 వరకు ఈ టోర్నీ జరగనుంది. ‘విజయ్ హజారే ట్రోఫీలో దిల్లీ జట్టు తరఫున ఆడటానికి రిషభ్ పంత్, శిఖర్ ధావన్, నవదీప్ సైని అంగీకరించారు. సీనియర్ సెలక్షన్ కమిటీ దిల్లీ జట్టును మరికొద్ది క్షణాల్లో ఖరారు చేయనుంది’ అని డీడీసీఏ ట్వీట్ చేసింది. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు భారత జట్టులో ధావన్, సైనికి చోటు దక్కని విషయం తెలిసిందే. కానీ, రిషభ్ పంత్ భారత టెస్టు జట్టులో ఉన్నాడు. అక్టోబర్ 2 నుంచి సఫారీలతో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పంత్ దిల్లీ తరఫున ఎన్ని మ్యాచులు ఆడనున్నాడనే దానిపై స్పష్టత లేదు.
‘దిల్లీ జట్టు తరఫున పంత్, ధావన్, సైని బరిలోకి దిగుతుండటం ఎంతో ఆనందంగా ఉంది. దిల్లీ క్రికెట్‌కు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ కూడా సేవ చేయాలని భావిస్తున్నాను. వారు కచ్చితంగా ఏదో రోజు దిల్లీ తరఫున ఆడతారు. వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో దిల్లీ క్రికెట్ అభిమానులకు వారు మాటిచ్చారు. వారంతా దిల్లీ తరఫున బరిలోకి దిగితే దిల్లీ క్రికెట్ స్థాయి మరింత పెరుగుతుంది. ఎన్నో టైటిళ్లను అందుకుంటారు’ అని డీడీసీఏ అధ్యక్షుడు రజత్శర్మ తెలిపారు. టీమ్ఇండియా ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో కూడా ఆడాలని భారత మాజీ ఆటగాడు సునిల్ గవాస్కర్ గతంలో పేర్కొన్నాడు. ‘భారత జట్టు మరింత రాణించాలంటే ఆటగాళ్లు ఫామ్‌లో ఉండాలి. దాని కోసం వారు క్రికెట్ ఆడుతూనే ఉండాలి’ అని అన్నాడు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
