
తాజా వార్తలు
నర్సంపేట : ఉదయపు నడకకు వెళ్లిన ఓ తెరాస నాయకుడిపై గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో దాడి చేసిన ఘటన బుధవారం తెల్లవారుజామున వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన అంబటి వెంకన్న తన భార్యతో కలిసి వరంగల్ రోడ్డులో ఉదయపు నడకకు వెళ్లారు. మార్గం మధ్యలో గుర్తు తెలియని దుండగులు కొందరు అకస్మాత్తుగా కత్తులు, గొడ్డళ్లతో ఆయనపై దాడి చేసి పరారయ్యారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రుడ్ని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఆసుపత్రికి తరలించారు. భూ తగాదాల కారణంగానే దాడి జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వెంకన్న భార్యపై కూడా దుండగులు చేయిచేసుకున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- నలుదిశలా ఐటీ
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- స్కైన్యూస్ నుంచి హెచ్‌సీఎల్ సీఈవోగా..
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
