
తాజా వార్తలు
రామచంద్రాపురం: ఇటీవల వైకాపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులపై ఏపీ ఉపముఖ్యమంత్రి, వైకాపా సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రిమూర్తులు పార్టీలో చేరినంత మాత్రాన తనకు మిత్రుడైపోరన్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న తోట త్రిమూర్తులను వైకాపాలో చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ద్రాక్షారామలో దళిత ఐక్యపోరాట వేదిక ఆధ్వర్యంలో పిల్లి సుభాష్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దళిత వ్యతిరేకిని ఏవిధంగా పార్టీలో చేర్చుకున్నారని వారు ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ ఆ కేసు విషయంలో ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. ‘‘పార్టీలోకి ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు. అప్పుడు..ఇప్పుడు..ఇక ముందు కూడా తోట త్రిమూర్తులే నాకు ప్రథమ శత్రువు’’ అని పిల్లి సుభాష్ వ్యాఖ్యానించారు.
1995 ఎన్నికల నుంచి త్రిమూర్తులు, పిల్లి సుభాష్‌చంద్రబోస్ ప్రత్యర్థులుగా కొనసాగారు. ఇటీవల సీఎం జగన్ సమక్షంలో తోట త్రిమూర్తులు వైకాపాలో చేరారు. ఈ నేపథ్యంలో తాజాగా త్రిమూర్తులపై పిల్లి సుభాష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- కిర్రాక్ కోహ్లి
- తీర్పు చెప్పిన తూటా
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
