close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9PM

1. ఏపీలో మూడు అసెంబ్లీ కమిటీల ఏర్పాటు

మూడు నూతన అసెంబ్లీ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి బాల కృష్ణమాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌ నియమితులయ్యారు. ఆయన నేతృత్వంలో మరో 12 మంది సభ్యులతో ప్రజాపద్దుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. 23నుంచి బతుకమ్మ చీరల పంపిణీ: కేటీఆర్‌

తెలంగాణ మహిళలకు బతుకమ్మ కానుకగా ప్రభుత్వం అందించనున్న చీరలను హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని సీడీఎంఏ భవంతిలో ప్రదర్శనకు ఉంచారు. పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రభుత్వం సుమారు రూ.300కోట్లకు పైగా వెచ్చించి వంద డిజైన్లలో చీరలను తయారు చేయించిందన్నారు. ఈనెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీని  ప్రారంభిస్తున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ప్రజలు తినగలిగే బియ్యాన్నే సేకరించండి: జగన్‌

ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రజలు తినగలిగే నాణ్యమైన బియ్యాన్నే సేకరించేలా ఇప్పటి నుంచి ప్రణాళిక వేసుకోవాలని సీఎం ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. పీవీ సింధుకి షాకిచ్చిన పోర్న్‌పవీ

ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధుకు చైనా ఓపెన్‌ కలిసిరాలేదు. టోర్నీ నుంచి ఆమె త్వరగా నిష్క్రమించింది. ప్రిక్వార్టర్స్‌లో థాయ్‌ల్యాండ్‌ షట్లర్‌ పోర్న్‌పవీ చోచువాంగ్‌ చేతిలో 12-21, 21-13, 21-19 తేడాతో ఓటమి పాలైంది. 58 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో గెలుపుకోసం సింధు తీవ్రంగా శ్రమించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. తొలి ‘ప్రైవేటు రైలు’టిక్కెట్లు రేపట్నుంచే..!

అత్యంత అధునాతన హంగులతో వచ్చే నెలలోనే పట్టాలెక్కనున్న తేజస్‌ రైలులో ప్రయాణానికి టిక్కెట్ల విక్రయం రేపట్నుంచే ప్రారంభం కాబోతోంది. దిల్లీ- లఖ్‌నవూ మధ్య ఐఆర్‌సీటీసీ నడపనున్న ఈ తొలి ప్రైవేటు రైలులో ప్రయాణానికి ఈ నెల 20 నుంచి టిక్కెట్లను విక్రయం జరుగుతుందని ఒక పత్రిక తన కథనంలో వెల్లడించింది. ఈ రైలులో తొలి రోజు ప్రయాణం కోసం రేపటి నుంచి టికెట్లను విక్రయిస్తారని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. మోదీ అమెరికా పర్యటన.. షెడ్యూల్‌ ఇదే

ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 21 నుంచి 27 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ  పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ కానున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ (యూఎన్‌జీఏ)లో ప్రసంగించనున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్‌ గోఖలే తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. తితిదే బోర్డులో ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ధర్మకర్తల మండలిలో ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు రాకేశ్ సిన్హా(దిల్లీ), ఏజే శేఖర్‌ (చెన్నై), కుపేందర్‌ రెడ్డి (బెంగళూరు), గోవింద హరి (హైదరాబాద్‌), దుశ్మంత్‌ కుమార్‌ దాస్‌ (భువనేశ్వర్‌), అమోల్‌ కాలే (ముంబయి)లను నియమించినట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. రేవంత్‌పై కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ పద్మావతిని నిలబెట్టి గెలిపిస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. హుజూర్‌నగర్‌లో ఎవరిని అభ్యర్థిగా పెట్టాలో మాకు తెలియదా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. మా జిల్లా విషయంలో పక్క జిల్లా నాయకుల సలహాలు అవసరం లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఉన్నావ్‌ బాధితురాలికి  ముప్పు: సీబీఐ

ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలికి ముప్పు ఉన్నట్టు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) బుధవారం ప్రత్యేక న్యాయస్థానికి వెల్లడించింది. దీంతో ఆమెకు భద్రత కల్పించే చర్యలపై వారంలోగా నివేదిక సమర్పించాలని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. టోక్యో ఒలింపిక్స్‌కు భజరంగ్‌, రవి అర్హత

భారత రెజ్లర్లు భజరంగ్‌ పునియా, రవి దహియా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో వరుస విజయాలతో చెలరేగారు. 65 కిలోల విభాగంలో భజరంగ్‌ తన ప్రత్యర్థులను చిత్తు చేసి సెమీఫైనల్‌ చేరుకున్నాడు. ప్రపంచ పోటీల్లో తొలి స్వర్ణం అందుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. మరో కుస్తీవీరుడు రవి దహియా (57 కిలోలు) సంచలన విజయాలతో తన పేరు మార్మోగించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.