
తాజా వార్తలు
క్రీడలను కెరీర్‌గా ఎంచుకొనే వెసులుబాటు ఉండాలి: గావస్కర్
ముంబయి: దేశంలో క్రీడలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని మాజీ క్రికెటర్ సునిల్ గావస్కర్ అన్నారు. పాఠశాల విద్యా ప్రణాళికలో ఆటలను చేర్చాలని సూచించారు. సానుకూల క్రీడా వాతావరణాన్ని సృష్టించేందుకు క్రీడలను కెరీర్ అవకాశంగా మార్చుకొనే పరిస్థితి కల్పించాలన్నారు. అశ్విని స్పోర్ట్స్ ఫౌండేషన్, ఎంబసీ గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన ఓ చర్చలో ఆయన పాల్గొన్నారు.
‘భారతదేశ అతిపెద్ద బలం జనాభా. విజేతలను కనుగొనడం సంక్లిష్టంగా ఉండొద్దు. నేనిక్కడ స్వర్ణ పతక విజేతల గురించే మాట్లాడటం లేదు. ముందుగా క్రీడలు అందరికీ అందుబాటులో ఉండాలి. పాఠ్య ప్రణాళికలో చేర్చాలి. పాఠశాల స్థాయి నుంచే క్రీడాకారులకు ప్రోత్సాహకాలు లభించాలి. క్రీడలను ఒక కెరీర్ అవకాశంగా ఎంచుకొనే వెసులుబాటు ఉండాలి. ఇవన్నీ ఉంటే దేశంలో మంచి క్రీడా వాతావరణాన్ని సృష్టించొచ్చు. ఆటలను కెరీర్ అవకాశంగా ఎంచుకున్న వెంటనే చిన్నారి, తల్లిదండ్రులు మిగతా అందరూ దానిపై ఆసక్తి పెంచుకుంటారు. పాఠశాలలు సైతం పాఠ్య ప్రణాళికలో ఆటలను మిళితం చేస్తాయి. అప్పుడు అందరికీ మేలు జరుగుతుంది. క్రీడలను కెరీర్ అవకాశంగా మలిస్తే యువకులు వాటిపై ఆసక్తి పెంచుకుంటారు. అందరూ ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదు. రంజీల్లో సైతం మంచి కెరీర్ ఉంటుంది. కార్పొరేట్ సంస్థలు, ఎయిర్‌లైన్స్, రైల్వేస్, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కన్నా ఎక్కువగా డబ్బు వస్తుంది’ అని గావస్కర్ అన్నారు.
బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారిణి అపర్ణ పోపట్ సైతం సన్నీ అభిప్రాయంతో ఏకీభవించారు. పతకాలు గెలచుకోవాలనే దృష్టితోనే క్రీడలను చూడొద్దన్నారు. 2016 రియో ఒలింపిక్స్‌లో 200పైగా దేశాల నుంచి 11,200 మంది పాల్గొంటే కేవలం 366 పతకాలు మాత్రమే ఇచ్చారన్నారు. ప్రభుత్వ నిధులను కచ్చితత్వంతో, వృథా కాకుండా ఖర్చుచేస్తే మంచి క్రీడాకారులను తయారు చేయొచ్చని తెలిపారు. క్రీడలకు మరిన్ని సీఎస్ఆర్ నిధులు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ‘న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి’
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- ‘వెంకీ మామ’ టీంతో రానా ముచ్చట్లు
- ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ ఫొటో వైరల్!
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
