close

తాజా వార్తలు

ప్రతి డ్రోన్‌నూ కూల్చేస్తాం : ఇరాన్‌

టెహ్రాన్‌ (ఇరాన్‌): తమ గగనతలంలోకి ప్రవేశించిన ప్రతి డ్రోన్‌నూ కూల్చి వేస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. సౌదీ అరేబియాలోని ఆరామ్‌కో చమురు కేంద్రాలపై ఇటీవల జరిగిన డ్రోన్‌ దాడులకు ఇరాన్‌ కారణమని అమెరికా నిందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్‌ సైన్యాధిపతి ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్‌ ‘ఎలాంటి పరిస్థితులనైనా’ ఎదుర్కొంటుందని, దురాక్రమణదారులను తరిమి కొట్టేందుకు లేదా నాశనం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆ దేశ సైన్యం ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) కమాండర్‌ మేజర్‌ జనరల్‌ హోస్సైన్‌ సలామీ శనివారం విలేకరులతో అన్నారు.
గత జూన్‌లో అమెరికాకు చెందిన నిఘా డ్రోన్‌ యూఎస్‌ ఆర్‌క్యూ-4ను ఇరాన్‌ కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆ డ్రోన్‌ తమ గగన తలంలోకి అక్రమంగా ప్రవేశించినందునే కూల్చామని ఇరాన్‌ చెప్పింది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య వివాదాస్పదంగా మారింది. సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్‌ దాడులు జరగడం, దానికి ఇరాన్‌ కారణమని అమెరికా ఆరోపించడంతో మళ్లీ ఆ పరిస్థితి తలెత్తింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.