close

తాజా వార్తలు

హౌడీ మోదీ..స్నాక్స్‌ రెడీ!

హ్యూస్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికాలో ఘన స్వాగతం లభించింది. అగ్రరాజ్యం వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు ఏకతాటిపై చేరనున్న ‘హౌడీ మోదీ’ కార్యక్రమం మరో కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రవాస భారతీయులు ప్రధాని మోదీ పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రధాని మోదీ హ్యూస్టన్‌ రావడం పట్ల సంతోషంగా ఉందని హ్యూస్టన్‌కు చెందిన ప్రవాస భారతీయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొందరు ఓ బృందంగా ఏర్పడి ‘హౌడీ మోడీ’ కార్యక్రమానికి వచ్చేవారికి ప్రత్యేకంగా ఆహారాన్ని తయారు చేసి ప్యాకెట్ల రూపంలో అందించేందుకు సిద్ధంగా ఉంచారు.  ఈ వేడుకలో పాల్గొనడానికి చాలా ఆతృతగా ఉన్నట్లు తెలిపారు. ‘భారత్‌ మాతా కీ జై’, వందేమాతరం, ‘జై మోదీ’ అంటూ నినాదాలు చేశారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.