close

తాజా వార్తలు

అదనపు నిధులపై ఓయో కన్ను

ఇంటర్నెట్‌డెస్క్‌: అదనపు నిధుల సమీకరణపై ‘ఓయో ’ దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా 750 మిలియన్‌ డాలర్ల నుంచి బిలియన్‌ డాలర్ల వరకు సమీకరించాలని దీని మాతృ సంస్థ  ఓరవెల్‌ స్టేస్‌ ఓవర్‌ ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో సాఫ్ట్‌ బ్యాంక్‌ గ్రూపు నిధులను పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓయో మార్కెట్‌ విలును 13.5 బిలియన్‌ డాలర్ల  నుంచి 15 బిలియన్‌ డాలర్ల మధ్య నిర్ణయించే అవకాశం ఉంది. 

ఓయో భారీ ప్రణాళికతో ముందుకు పోతోంది. రితీష్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని ఈ కంపెనీ వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా విలాసవంతమైన ఫైవ్‌స్టార్‌  హోటళ్లను నిర్వహించాలని భావిస్తోంది. ఓయో భారీగా విలువను పెంచుకోనేందుకు కార్పొరేట్‌ పునర్‌ వ్యవస్థీకరణ చేస్తోంది. కొత్తగా పలు అనుబంధ సంస్థలను నెలకొల్పుతోంది.  ఇటీవల సంస్థ విలువను 10 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేసిన సమయంలో అగర్వాల్‌ 1.5 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేశారు. ఈ బైబ్యాక్‌ను సీసీఐ ఆమోదించింది. దీంతోపాటు అగర్వాల్‌ ఓయో ఇండియా విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నుంచి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా మారిపోయారు. ఆయన ప్రపంచ వ్యాప్తంగా విస్తరణపై దృష్టిపెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.