
తాజా వార్తలు
ముంబయి: దేశవాళీ క్రికెట్లో ప్రతిష్ఠాత్మక విజయ్ హజారె టోర్నీలో ఈ సారి 38 జట్లు తలపడనున్నాయి. వీటిని గ్రూప్-ఎ, గ్రూప్-బి, గ్రూప్-సి, ప్లేట్ గ్రూప్‌గా విభజించారు. గ్రూప్-ఎ, గ్రూప్-బి గ్రూప్‌ల్లోని టాప్-5, గ్రూప్-సిలోని టాప్-2, ప్లేట్ గ్రూప్‌లోని టాప్ టీమ్‌ను క్వార్టర్స్ ఫైనల్స్‌కు ఎంపిక చేస్తారు. దేశవాళీ వన్డే ఫార్మాట్ అయినా ఈ టోర్నీలో భారత స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే భారత ఓపెనర్ శిఖర్ ధావన్, యువకెరటం రిషభ్ పంత్, పేసర్ నవదీప్ సైని దిల్లీ తరఫున ఆడనున్నారనేది తెలిసిన విషయమే. సెప్టెంబర్ 24 నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, రాబిన్ ఉతప్ప, యువ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, హనుమ విహారి కూడా ఆడనున్నారు. కానీ, అక్టోబర్ 2 నుంచి సఫారీలతో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ భారత జట్టులో పంత్, గిల్, విహారి ఉన్నారు. దీంతో విజయ్ హజారే ట్రోఫీలో వారు ప్రాతినిధ్యం వహించే జట్ల తరఫున ఎన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారనే దానిపై స్పష్టత లేదు.
ఆటగాళ్ల వివరాలు:
ముంబయి: శ్రేయస్ అయ్యర్ (సారథి)
దిల్లీ: శిఖర్ ధావన్, రిషభ్ పంత్, నవదీప్ సైని
తమిళనాడు: దినేశ్ కార్తీక్ (సారథి), మురలీ విజయ్, విజయ్ శంకర్, వాషింగ్టన్ సుందర్
రాజస్థాన్: దీపక్ చాహర్
కేరళ: రాబిన్ ఉతప్ప (కేరళ)
నాగ్‌లాండ్: స్టువర్ట్ బిన్నీ
ఆంధ్రా: హనుమ విహారి (సారథి)
పంజాబ్: శుభ్‌మన్ గిల్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- ‘రూలర్’ కొత్త ట్రైలర్ చూశారా
- జపాన్‌లో రానా బర్త్‌డే సెలబ్రేషన్స్
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
- మృతదేహంతో నడిరోడ్డుపై నరకయాతన
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- అలా అయితే విసుగొచ్చేస్తుందట!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
