
తాజా వార్తలు
నల్గొండ: హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విశ్వాసం వ్యక్తంచేశారు. నల్గొండను నట్టేట ముంచిన కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఉప ఎన్నిక ద్వారా హుజూర్నగర్ ప్రజలకు ఓ మంచి అవకాశం దక్కిందన్నారు. నల్గొండలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
హుజూర్‌నగర్‌లో తెరాస విజయం తథ్యమని కేటీఆర్ అన్నారు. ఐదేళ్ల మూడు నెలల్లో పాలనాకాలంలో నల్గొండకు తెరాస ఎంతో చేసిందని.. ప్రజలంతా ఒక్కసారి గమనించాలన్నారు. 2004, 2009 కాంగ్రెస్ మేనిఫెస్టోలో తండాలను పంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చిందని.. కానీ ఆ తండాలను పంచాయతీలను చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. యాదాద్రిని సైతం కాంగ్రెస్ నేతలు ఏ రోజూ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. నామినేషన్ల సమయంలో మాత్రమే ఆలయాన్ని దర్శించుకునేవారని.. అలాంటి ఆలయాన్ని దాదాపు రూ.500 కోట్లతో తెరాస ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని చెప్పారు. భాజపా వాళ్లు ఎగిరెగిరి పడుతున్నారని, తర్వాతే మేమే అన్నట్లు గొప్పలకు పోతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల గుండెల్లో ఎవరున్నారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలో తెరాస డబ్బులు పంచుతుందని ఉత్తమ్ అంటున్నారని, గతంలో కోదాడలో డబ్బుతో ఉన్న ఇన్నోవా ఎవరిదో ఓసారి గుర్తుచేసుకోవాలన్నారు. ఎన్నికల్లో సైదిరెడ్డి గెలుపునకు కార్యకర్తలు పాటుపడాలని పిలుపునిచ్చారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- ‘రూలర్’ కొత్త ట్రైలర్ చూశారా
- జపాన్‌లో రానా బర్త్‌డే సెలబ్రేషన్స్
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
- మృతదేహంతో నడిరోడ్డుపై నరకయాతన
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- అలా అయితే విసుగొచ్చేస్తుందట!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
