
తాజా వార్తలు
1. కేసీఆర్, జగన్ భేటీ ప్రారంభం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్లో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. లోటస్ పాండ్ నుంచి ప్రగతిభవన్‌కు చేరుకున్న జగన్‌కు కేసీఆర్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కేసీఆర్‌ను జగన్ ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఆహ్వానపత్రికను కేసీఆర్‌కు ఆయన అందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి |
2. హుజూర్నగర్ ప్రజలకిదో అవకాశం: కేటీఆర్ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విశ్వాసం వ్యక్తంచేశారు. నల్గొండను నట్టేట ముంచిన కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఉప ఎన్నిక ద్వారా హుజూర్నగర్ ప్రజలకు ఓ మంచి అవకాశం దక్కిందన్నారు. నల్గొండలోనియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో సోమవారం ఆయన పాల్గొని మాట్లాడారు. హుజూర్‌నగర్‌లో తెరాస విజయం తథ్యమని కేటీఆర్ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి |
3. పోలవరం పూర్తికి మరో ఐదేళ్లు: దేవినేని పోలవరం భద్రతను సీఎం జగన్ తాకట్టు పెట్టారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. పోలవరం ప్రధాన డ్యామ్, జల విద్యుత్ కేంద్రం పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్వార్థపూరిత రాజకీయాలతో గుత్తేదార్లను లొంగదీసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలతో పోలవరం ప్రాజెక్టు మరో ఐదేళ్లు ఆలస్యమవుతుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి |
4. రాష్ట్రపతితో గవర్నర్ తమిళిసై భేటీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం దిల్లీ వెళ్లిన ఆమె రాష్ట్రపతి భవన్లో కోవింద్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలోని పరిస్థితులను రాష్ట్రపతికి తమిళిసై వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతోనూ ఆమె భేటీ కానున్నారు. మంగళవారం హరియాణాలో జరగనున్న గవర్నర్ల ఉపసంఘం సమావేశానికి తమిళిసై హాజరుకానున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి |
5. పదివేల యాప్స్ తొలగించిన ఫేస్బుక్ ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తమ నెట్వర్క్ పరిధిలోని ప్రమాదకరమైన 10వేల అప్లికేషన్లను తొలగించినట్లు తెలిపింది. గత సంవత్సరం మార్చిలో కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదం సందర్భంగా దర్యాప్తు చేపట్టిన సంస్థ ఈ చర్యలకు ఉపక్రమించినట్లుగా వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి |
6. మెట్రో ఘటన: మౌనిక కుటుంబానికి ₹ 20లక్షలు అమీర్‌పేట్ రైల్వేస్టేషన్ వద్ద మెట్రో పిల్లర్ పెచ్చులూడి పడి మృతి చెందిన మౌనిక కుటుంబానికి రూ.20 లక్షల నగదు, సుమారు రూ.15 లక్షల బీమాతో పాటు.. ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు కూడా మెట్రో ప్రతినిధులు అంగీకరించినట్లు సీపీఐ నేత సుధాకర్ తెలిపారు.మౌనిక కుటుంబ సభ్యుల తరఫున మెట్రో ప్రతినిధులతో కోదండరామ్, సుధాకర్ సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి |
7. కశ్మీర్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం జమ్ముకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు యత్నిస్తున్న ఉగ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. కథువా ప్రాంతంలో తనిఖీలు చేపట్టి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కథువా జిల్లాలోని మల్హార్ బెల్ట్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో జమ్ముకశ్మీర్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో 38 కేజీలకు పైగా భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి |
8. మృతుల కుటుంబాలకు మరో ₹10లక్షలు గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ఘటనలో పోలీసు శాఖ తప్పేమీ లేదని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి చెప్పారు. ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోందని.. అది పూర్తయ్యాక మరిన్ని వివరాలు చెబుతామన్నారు. దర్యాప్తు విషయంలో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని అస్మి స్పష్టం చేశారు. బోటు ప్రమాదం మృతుల కుటుంబీకులకు ప్రభుత్వ సాయానికి అదనంగా రూ.10లక్షల బీమా సహాయాన్ని కల్పిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి |
9. అదనపు నిధులపై ఓయో కన్ను అదనపు నిధుల సమీకరణపై ‘ఓయో ’ దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా 750 మిలియన్ డాలర్ల నుంచి బిలియన్ డాలర్ల వరకు సమీకరించాలని దీని మాతృ సంస్థ ఓరవెల్ స్టేస్ ఓవర్ ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో సాఫ్ట్ బ్యాంక్ గ్రూపు నిధులను పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓయో మార్కెట్ విలును 13.5 బిలియన్ డాలర్ల నుంచి 15 బిలియన్ డాలర్ల మధ్య నిర్ణయించే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి |
10. విరాట్ కోహ్లీని మందలించిన రిఫరీ టీమిండియా సారథి విరాట్ కోహ్లీని రిఫరీ హెచ్చరించారు. ఐసీసీ నిబంధనావళిని ఉల్లంఘించినందుకు ఒక డీమెరిట్ పాయింట్‌ను విధించారు. దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో ప్రత్యర్థి బౌలర్ బ్యూరాన్ హెండ్రిక్స్ భుజాన్ని కోహ్లీ అనుచితంగా తాకడమే ఇందుకు కారణం. ఫీల్డ్ అంపైర్లు నితిన్ మేనన్, సీకే నందన్, మూడో అంపైర్ అనిల్ చౌదరి, నాలుగో అధికారి చెట్టిహొది శంషుద్దీన్ అతడిపై అభియోగాలు నమోదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి |
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
- ఉసురు తీశాడు.. ఉరిపోసుకున్నాడు
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
