
తాజా వార్తలు
న్యూదిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన కార్పొరేట్ పన్ను రాయితీలతో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ అత్యంత ఆకర్షణీయమైన దేశంగా మారిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యను అత్యంత సాహసోపేతమైనదిగా ఆయన అభివర్ణించారు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడులకు భారత్ అత్యంత ఆకర్షణీయంగా మారిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 28ఏళ్లలో ఇచ్చిన అతిపెద్ద రాయితీగా ఆయన చెప్పారు. ఈ ఒక్క నిర్ణయమే భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటును ఆరేళ్ల అత్యల్ప వృద్ధి నుంచి, 45ఏళ్లలో అత్యధిక గరిష్ఠ నిరుద్యోగ రేటు నుంచి బయటపడేస్తుందన్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి 1.45కోట్ల మేరకు ఆదాయం తగ్గుతుందని వెల్లడించారు.
‘‘ప్రభుత్వం చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొంది. ఇది చాలా సానుకూలమైన చర్య. ఇప్పుడు భారత్‌లో కార్పొరేట్ పన్నులు ఆసియాన్‌లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పన్నులతో పోటీపడతాయి. ఇప్పటి వరకు ఇక్కడి పన్నులపై అంతర్జాతీయ సంస్థలు, పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఈ నిర్ణయంతో భారత్ తీవ్రమైన పోటీ ఇస్తుంది. భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తుంది.’’ అని దాస్ పేర్కొన్నారు.
‘‘ఇక దేశీయ పెట్టుబడిదారుల చేతిలో భారీగా నగదు మిగులుతుంది. వారు పెద్ద ఎత్తున మూలధన వ్యయం చేయడానికి అవకాశం ఉంది. పరపతి విధాన సమీక్షకు ముందు ఆర్థిక మంత్రిని కలిసి ఆర్థిక వ్యవస్థపై చర్చించడం ఆనవాయితీ. నేడు అందుకే వచ్చాను.’’ అని దాస్ తెలిపారు. అక్టోబర్ 1 నుంచి మూడురోజుల పాటు పరపతి విధాన సమీక్ష సమావేశం జరగనుంది. 4వ తేదీన కొత్త పరపతి విధానాన్ని ప్రకటించనున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- 8 మంది.. 8 గంటలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- సినిమా పేరు మార్చాం
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
