close

తాజా వార్తలు

ఆ పంపకాలు భారత్‌-పాక్‌ విభజన కన్నా కష్టం!

త్వరలోనే సీట్ల సర్దుబాటు విషయంలో స్పష్టత :శివసేన

ముంబయి: మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ సీట్లను భాజపా-శివసేన పంచుకోవడం అత్యంత క్లిష్టమైన వ్యవహారమని ఆ పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. మిత్ర పక్షాలైన భాజపా-శివసేన మధ్య సీట్ల పంపకాలు భారత్‌-పాక్‌ విభజన సమస్య కన్నా కష్టతరమైనదని ఆయన అభివర్ణించారు. మంగళవారం ఆయన ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ క్లిష్టతరమైన సీట్ల పంపకాలపై త్వరలో రెండు పార్టీలు తుది నిర్ణయానికి వస్తాయని వెల్లడించారు. ‘‘సీట్ల పంపకాల విషయంలో రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలు వచ్చాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ అలాంటిదేమీ లేదు. ఇరు పార్టీల అగ్ర నేతలు దీనిపై చర్చలు జరుపుతున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా త్వరలోనే మీడియాకు వెల్లడిస్తాం.’’ అని ఆయన అన్నారు.

సోమవారం రాత్రి సీట్ల విషయంలో భాజపా-శివసేన నేతల మధ్య జరిగిన చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని శివసేన వర్గాలు తెలిపాయి. 10 సీట్ల విషయంలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నట్లు వారు చెప్పారు. మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉన్నా, సీట్ల సంఖ్యపై స్పష్టత లేనందున దాన్ని వాయిదా వేశారు.

ప్రస్తుతం మహారాష్ట్ర శాసనసభలో భాజపాకు 122 సీట్లు, శివసేనకు 63 స్థానాలు ఉన్నాయి. శివసేన ఎన్డీయేలోనే ఉన్నా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. తాజా లోక్‌సభ ఎన్నికల్లో భాజపా-శివసేన కూటమి మొత్తం 48 స్థానాల్లో 41 సీట్లను కైవసం చేసుకుంది. శాసనసభ ఎన్నికలు మహారాష్ట్రలో అక్టోబరు 21న జరగనున్న సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపు అదే నెల 24న జరగనుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.