close

తాజా వార్తలు

ఏపీలో రుణమాఫీ ఉత్తర్వులు రద్దు

అమరావతి: గత ప్రభుత్వం హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వులను జగన్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఏడాది మార్చి 10న జారీ చేసిన జీవో 38ని రద్దుచేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 4-5 విడతల్లో ఇవ్వాల్సిన రుణమాఫీ నిధులు రూ.7959.12 కోట్లు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ రెండు విడతల్లో మొత్తం 10శాతం వడ్డీని కలుపుతూ గత ప్రభుత్వం జీవో నంబర్‌ 38ని జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చిన ఈ రుణమాఫీ జీవోను రద్దుచేస్తూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఈ జీవోను రద్దు చేస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం అమలు నేపథ్యంలో ఈ తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.