close

తాజా వార్తలు

‘రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్‌’

దిల్లీ: నగరంలో అద్దె ఇళ్లలో నివసించే వారికి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓ శుభవార్త చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘ముఖ్యమంత్రి కిరాయిదార్‌ బిజ్లి మీటర్‌ యోజన’ పథకం కింద అద్ధె ఇళ్లలో ఉండే వారు 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగిస్తే వారికి ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తామని తెలిపారు. ఈ పథకం కింద ప్రీపెయిడ్‌ మీటర్లను అద్దె గృహలకు బిగిస్తామన్నారు. 200 యూనిట్ల కంటే ఎక్కువ యూనిట్ల విద్యుత్‌ వాడకం జరిగితే సొంత గృహలు ఉన్న వారు చెల్లించినట్లే రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. ఈ పథకం కేవలం నివాస గృహలలో ఉపయోగించే మీటర్లకు మాత్రమే వర్తింస్తుందన్నారు. 
అద్దె ఇళ్లలో నివసించేవారు తమ ప్రాంతానికి చెందిన విద్యుత్‌ సరఫరాదారుని ద్వారా ఈ మీటర్లను పొందవచ్చాన్నారు. ఈ పథకాన్ని పొందాలంటే అద్దె ఇళ్లలో నివసించేవారు వారి చిరునామా పత్రం, అద్దె ఒప్పంద పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఇంటి యజమానికి ఎటువంటి అభ్యంతరం లేనట్లు ఒక పత్రాన్ని ఇవ్వాల్సింటుందన్నారు. 
ముందుగా  ఈ పథకం వినియోగించేకునేవారు ముందుగా రూ.3000 సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాల్సివుంటుంది. వినియోగదారులు మీటర్లను ఉపయోగించడం ఆపేసిన తరువాత ఈ సొమ్ము తిరిగి ఇచ్చేయడం జరుగుతుందన్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.