
తాజా వార్తలు
దిల్లీ: పీపీఏలను సమీక్షించాలని పట్టుబడుతున్న ఏపీ సర్కార్.. అంతకంటే ఎక్కువ ఖరీదైన బొగ్గు ఆధారిత విద్యుత్ పీపీఏల్లో ఎందుకు పక్షపాతం చూపుతోందని దిల్లీకి చెందిన ఆర్థిక పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ (సీఎఫ్ఏ) ప్రశ్నించింది. పునరుత్పాదక ఇంధన వనరుల యూనిట్‌కు కేవలం రూ.4.54 ఖర్చు అవుతుండగా.. ప్రస్తుత ఏడాదిలో బొగ్గు ఆధారిత విద్యుత్ (థర్మల్)పై ఏపీ ప్రభుత్వం రూ.5.75 వెచ్చించనుందని సీఎఫ్ఏ పేర్కొంది. విద్యుత్ ధరలు తగ్గించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమైతే.. పర్యావరణానికి హాని చేసే థర్మల్ విద్యుత్‌పై ఆధారపడటం తగ్గించాలని హితవు పలికింది. ఇటీవలే గుజరాత్లో థర్మల్ విద్యుత్‌కు అనుమతులు నిలిపివేయగా ఛత్తీస్‌గఢ్ కూడా అదే తరహాలో యోచిస్తోందని తెలిపింది. ఈ పరిస్థితుల్లో అధిక ధరల బొగ్గు విద్యుత్‌కు మద్దతు పలుకుతూ పునరుత్పాదక విద్యుత్ సంస్థల పీపీఏల పట్ల ఏపీ ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదని సీఎఫ్ఏ అభిప్రాయపడింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
- మంత్రివర్గంలో వారికి చోటిస్తాం: యడియూరప్ప
ఎక్కువ మంది చదివినవి (Most Read)
