close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. విశాఖ మన్యంలో బాక్సైట్‌ అనుమతులు రద్దు

విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏపీ ఎండీసీకి ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. విశాఖ జిల్లా చింతపల్లి మండలంలోని జెర్రెల బ్లాక్‌ 1, బ్లాక్‌ 2, బ్లాక్‌ 3.. అరకు మండలంలోని అనంతగిరి, గాలికొండ, చింతమగొంది, రక్తకొండ బ్లాక్‌ బాక్సైట్‌ తవ్వకాలకు 30 ఏళ్లపాటు ఏపీ ఎండీసీ గతంలో అనుమతులిచ్చింది. తాజాగా ఆ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పీపీఏల్లో పక్షపాతం ఎందుకు?: సీఎఫ్‌ఏ

పీపీఏలను సమీక్షించాలని పట్టుబడుతున్న ఏపీ సర్కార్‌.. అంతకంటే ఎక్కువ ఖరీదైన బొగ్గు ఆధారిత విద్యుత్‌ పీపీఏల్లో ఎందుకు పక్షపాతం చూపుతోందని దిల్లీకి చెందిన ఆర్థిక పరిశోధన సంస్థ సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ అకౌంటబిలిటీ (సీఎఫ్‌ఏ) ప్రశ్నించింది. పునరుత్పాదక ఇంధన వనరుల యూనిట్‌కు కేవలం రూ.4.54 ఖర్చు అవుతుండగా.. ప్రస్తుత ఏడాదిలో బొగ్గు ఆధారిత విద్యుత్‌ (థర్మల్‌)పై ఏపీ ప్రభుత్వం రూ.5.75 వెచ్చించనుందని సీఎఫ్‌ఏ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ముగిసిన వేణుమాధవ్‌ అంత్యక్రియలు

వేలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌ అంత్యక్రియలు ముగిశాయి. నగరంలోని మౌలాలి హౌసింగ్ బోర్డులోని శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు వేణు దహన సంస్కారాలు నిర్వహించారు. పలువురు, సినీ రాజకీయ ప్రముఖులతోపాటు పెద్ద సంఖ్యలో అభిమానులు వేణు మాధవ్‌కు కడసారి నివాళులర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదు’

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంతో పోలిస్తే దక్షిణ మధ్య రైల్వేకి భాజపా ఏడు రేట్లు అధికంగా నిధులు కేటాయించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యాతో జరిగిన ఎంపీల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ప్రస్తుతం రూ.1,813 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఏపీ పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పు

పదోతరగతి ప్రశ్నాపత్రంలో కీలక మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి బిట్ పేపరును తొలగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రశ్నాపత్రంలో దీన్ని అంతర్భాగంగానే ఉంచి విద్యార్థి జ్ఞానాన్ని పరీక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం అదనంగా మరో 15 నిముషాలను ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రుణమాఫీపై చర్చకు సిద్ధమా?:కన్నబాబు

రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని 2014 ఎన్నికల్లో తెదేపా హామీ ఇచ్చిందని.. అధికారంలో వచ్చాక కేవలం రూ.15వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆరోపించారు. ఇచ్చిన హామీలను ఐదేళ్లలో ఎందుకు నిలబెట్టుకోలేక పోయారని ఆయన ప్రశ్నించారు. రైతు రుణమాఫీపై తెదేపా అధినేత చంద్రబాబు చర్చకు సిద్ధమా? అని కన్నబాబు సవాల్‌ విసిరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రజనీ, కమల్‌.. రాజకీయాల్లోకి రాకండి: చిరు

తమిళ అగ్ర హీరోలు కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రాకపోతేనే మంచిదని కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్‌ చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఇటీవల ఆయన  ‘ఆనంద వికటన్‌’ అనే తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలంటే డబ్బుమయమైపోయాయని వ్యాఖ్యానించారు. అందుకే వారిద్దరూ రాజకీయాల్లోకి రావొద్దని చిరంజీవి సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. స్పైస్‌జెట్‌ నుంచి 46 కొత్త సర్వీసులు

బడ్జెట్‌ ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ దేశీయ సర్వీసులను మరింత విస్తరించనుంది. ఈ శీతకాలంలోపు మరో 46 కొత్త డైరెక్ట్‌ సర్వీసులను ప్రారంభించనున్నట్లు గురువారం ప్రకటించింది. మొదటగా తమ 54వ సర్వీసుగా ముంబయి-రాజ్‌కోట్‌ విమానాన్ని నడపనున్నట్లు సంస్థ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గోపిచంద్‌ ‘చాణక్య’ ట్రైలర్‌ చూశారా?

10. ఇండోనేషియాలో భూకంపం: 20మంది మృతి

ఇండోనేషియాలోని మాలుకు ద్వీపంలో భూకంపం సంభవించింది.దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.5గా నమోదైంది. భూకంపం ధాటికి 20 మంది మృత్యువాత పడగా.. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. పలుచోట్ల ఇళ్లు, కొండచరియలు విరిగిపడ్డాయి. భూకంప కేంద్రాన్ని మాలుకు ద్వీపంలోని కొటా అంబాన్‌కు 29 కి.మీ దూరంలో గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.